టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఎలాంటి క్రేజ్‌తో దూసుకుపోతున్నాడో తెలిసిందే. తాజాగా దేవరతో బ్లాక్ బస్టర్ అందుకున్న తారక్.. బాలీవుడ్ గ్రీకువీరుడు హృతిక్ రోషన్‌తో కలిసి మల్టీ స్టారర్ సినిమాలో నటిస్తున్నాడు. ఇక వార్ 2 టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ ప్రస్తుతం వైరల్ గా మారుతుంది. లైఫ్‌లో మొట్టమొదటిసారి వార్ 2 కోసం తారక్ అలాంటి పని చేస్తున్నాడంటూ వార్త ట్రెండ్ అవుతుంది.
ఇంతకీ అసలు మేటర్ ఏంటో ఒకసారి చూద్దాం. ఎన్టీఆర్ అభినయంతో పాటు డ్యాన్స్‌కు కూడా తిరుగుండదు అన్న సంగతి తెలిసిందే. ఎలాంటి స్టెప్స్ అయినా సరే అవలీలగా వేసే తారక్.. ఎంత కష్టమైనా స్టెప్స్ అయినా ప్రాక్టీస్ లేకుండా సింగిల్ టేక్ లోనే చేసి చూపిస్తాడు. అంతగా డ్యాన్స్‌ను ఇష్టపడే ఎన్టీఆర్.. ప్రస్తుతం వార్ 2 షూట్‌లో బిజీగా ఉన్నాడు.
ఈ క్రమంలోనే వీరిద్దరి కాంబోలో అదిరిపోయే సాంగ్ డిజైన్ చేశారట మేకర్స్. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కలిసి స్టెప్పులు వెయ్యబోతున్నాడట. దానికోసం ఏకంగా ముగ్గురు కొరియోగ్రాఫర్ స్టెప్స్ కొరియోగ్రాఫ్ చేశారని.. అయితే ఇప్పటివరకు తన సినీ కెరీర్‌లో ఎంత పెద్ద స్టెప్స్ అయినా ప్రాక్టీస్ లేకుండానే సింగిల్ టేక్ లో చేసి చూపించిన తారక్.. వార్ 2లో ఆ సాంగ్ కోసం ఎప్పటినుంచో స్టెప్స్ ప్రాక్టీస్ చేస్తున్నాడంటూ ఓ న్యుస్ వైరల్ గా మారుతుంది.