సంధ్య థియేటర్ ఇష్యూలో రేవతి అనే మహిళ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆమె కొడుకు శ్రీ తేజ పరిస్థితి విషమంగా ఉండడంతో.. ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే పోలీసులు.. అల్లు అర్జున్ పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ పై తాజాగా మరో కేసు నమోదు అయ్యింది. అల్లు అర్జున్ వర్సెస్ తెలంగాణ గవర్నమెంట్ అన్నట్లుగా వార్ కొనసాగుతుంది. సిఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా అల్లు అర్జున్ పై ఘాటు విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. అనుమతి లేకుండా సంధ్య థియేటర్ కి బన్నీ వెళ్ళాడని.. మహిళ మృతికి కారణమయ్యాడని.. నిర్లక్ష్యంతో అల్లు అర్జున్ వ్యవహరించాడని మండిపడ్డాడు.
అరెస్ట్ అయిన అల్లు అర్జున్ బెయిల్ పై రిలీజ్ కాగా సినీ ప్రముఖులు అంత ఆయనను పరామర్శించడంపై సీఎం రేవంత్ రెడ్డి అసహనం వ్యక్తం చేసాడు. కాగా.. తాజాగా బన్నీ ఇంటిపై దాడి ఘటన సంచలనంగా మారింది. ఉస్మానియా యూనివర్సిటీ జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు ఈ దాడికి పాల్పడ్డారు. అల్లు అర్జున్ ఇంటి ఆవరణలో ప్రవేశించిన వాళ్ళు ఇంటిపై దాడి చేస్తూ.. విధ్వంసాన్ని సృష్టించారు. ఈ దాడికి సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో ప్రస్తుతం తెగ వైరల్‌గా మారుతున్నాయి. అల్లు అరవింద్ దాడి పై రియాక్ట్ అవుతూ మేము సమన్వయం పాటిస్తున్నాము.
చట్టం ప్రకారం ముందుకు వెళ్తామంటూ అల్లు అరవింద్ మీడియాకు చెప్పుకొచ్చాడు. ఇకపై తెలంగాణ బెనిఫిట్ షోలకు టికెట్ ధరల పెంపుకు అనుమతి లేదని.. రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా ప్రకటించి.. టాలీవుడ్‌తో హఅమీతుమీకి సిద్ధమన్నట్లుగా సందేశం పంపాడు. రేవంత్ రెడ్డి విమర్శల క్రమంలో.. అల్లు అర్జున్ మీడియా ముందుకు వచ్చి ఆయన పేరు చెప్పకుండా.. ఇన్ డైరెక్టర్ కౌంటర్స్ వేశాడు. కావాలని చేసింది కాదు.. ఏది అనుకున్న ప్రమాదం కాదు.. తప్పుడు ప్రచారంతో నా క్యారెక్టర్ దెబ్బతీస్తున్నారు. శ్రీ తేజ ఆరోగ్యం, భవిష్యత్తు పట్ల నాకు బాధ్యత ఉందంటూ బన్నీ చెప్పుకొచ్చాడు.
తాజాగా బన్నీపై మరో కేసు నమోదయింది. కాంగ్రెస్ ఎమ్మెల్సీ మల్లన్న అల్లు అర్జున్ పై కేసు పెట్టారు. పుష్ప 2 మూవీలో.. అల్లు అర్జున్ పోలీస్ అధికారి స్నానం చేస్తున్న స్విమ్మింగ్ పూల్ లో మూత్రం పోస్తాడు. ఇది పోలీస్ వ్యవస్థకు అవమానమే. పుష్ప 2 హీరో అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్, నిర్మాతలపై చర్యలు తీసుకోవాలి అంటూ మేడ్పల్లి పోలీస్ స్టేషన్‌లో తీన్మార్ మల్లన్న కంప్లైంట్ చేశాడు. సంధ్య థియేటర్ వివాదం జరిగిన నాటి నుంచి.. ఆయన అల్లు అర్జున్ పై ఎప్పటికప్పుడు మండిపడుతూనే ఉన్నాడు. ఆయన ప్రచార దృష్టితో చేసిన తప్పు ఒకరి ప్రాణాలు తీసింది అని మండిపడ్డాడు. సంధ్య థియేటర్ వివాదం అంతకంతకు పెరుగుతున్న క్రమంలో అల్లు అర్జున్ కు ఇచ్చిన జాతీయ అవార్డు వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు.