సంధ్య థియేటర్ ఘటన దేశవ్యాప్తంగా ఎంత దుమారం రేపిందో తెలిసిందే. ఈ క్రమంలోనే తెలంగాణ గవర్నమెంట్ కూడా సినిమాల విషయంలో కఠిన నిర్ణయం తీసుకుంది. తోక్కీసులాటలో మహిళా ప్రాణాలు కోల్పోవడం పై రేవంత్ రెడ్డి ఇండస్ట్రీ పై సీరియస్ అయ్యాడు. ప్రాణాలు పోతున్నాయంటే సినిమా వాళ్ళను కూడా ఉపేక్షించేది లేదంటూ మండిపడ్డాడు. బాదితుల కుటుంబాన్ని ఇండస్ట్రీ నుంచి పరామర్శించిన వారే లేరని.. బన్నీ ఇంటికి మాత్రం బారులు తేరారంటూ అసహనాన్ని వ్యక్తం చేశాడు.
ఇకపై సినిమాలకు సంబంధించిన బెనిఫిట్ షోలకు, టికెట్ ధరల పెంపుకు అసలు అనుమతులు ఉండవని.. తన గవర్నమెంట్ ఉన్నంతవరకు ఈ రూల్స్ మారదంటూ చెప్పుకొచ్చాడు. దీంతో సంక్రాంతి సినిమాల రిలీజ్ విషయంలో నిర్మాతలకు పెద్ద ఫరక్ తప్పదని కామెంట్‌లు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం ఫిక్స్ చేసేదారులకే సినిమా టికెట్లు అమ్ముకోవాలంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలోనే తాజాగా డాకు మహారాజ్ ప్రచారంలో నిర్మాత నాగవంశీ ఆసక్తికర కామెంట్లు చేశాడు.
ఇండస్ట్రీ వాళ్లంతా మళ్ళీ సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తారా.. అనే ప్రశ్న ఎదురుకాగా.. దానికి నాగవంశీ.. రాజుగారు అమెరికాలో ఉన్నారు. మా సినిమా కంటే ఆయన సినిమా ముందు రిలీజ్ కానుంది. ఆయన సినిమాకి టికెట్ ధరలు పెరిగితే.. మా సినిమా టికెట్ ధరలు ఆటోమేటిక్గా పెరుగుతాయి.. రాజుగారు హైదరాబాద్‌కు రాగానే.. అంతా దాని గురించి చర్చించుకుని ఓ నిర్ణయానికి వస్తాం అంటూ కామెంట్స్ చేశాడు. అంటే సీఎం రేవంత్ రెడ్డిని కలవాలా.. వద్దా.. అనేది దిల్ రాజు ఇండియాకి వచ్చిన తర్వాత డిస్సైడ్ అవుతుందట. ఇక జనవరి 10న దిల్ రాజు గేమ్ ఛేంజర్ రిలీజ్ కానుంది. ఇక డాకు మహారాజ్ రెండు రోజుల తర్వాత 12వ తేదీన రిలీజ్ అవుతుంది. ఈ క్రమంలోనే నాగవంశీ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.