ప్రముఖ మీడియా సంస్థ ఆర్నెక్స్ ప్రతినెల దేశంలోని సెలబ్రిటీలపై ఒక సర్వేలు నిర్వహిస్తుందన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఓ జాబితాను రిలీజ్ చేశారు. ఇండియాలోనే మోస్ట్ పాపులర్ టాప్ పొజిషన్ లోని హీరో హీరోయిన్ల జాబితా ప్రస్తుతం నెటింట తెగ ట్రెండ్ అవుతుంది. అందులో భాగంగా నవంబర్ నెలకు గాను మోస్ట్ పాపులర్ స్టార్స్ జాబితాను ఓర్మిక సంస్థ ప్రకటించారు. ఇందులో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నెంబర్ వన్ పొజిషన్ లో ఉంటే.. ఆయన తర్వాత పోజీషన్ కూడా మన టాలీవుడ్ సెలబ్రిటీ దక్కించుకోవడం విశేషం. ఇక రెండో పొజిషన్‌ను టాలీవుడ్ స్టార్ బ్యూటీగా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న సమంత దక్కించుకుంది.
అంతేకాదు.. మోస్ట్ పాపులర్ హీరోయిన్ల జాబితాలో సమంత నెంబర్ వన్ పొజిషన్ దక్కించుకోవడం వరుసగా ఇది మూడోసారి. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలలో ప్రతిసారి ఫస్ట్ ప్లేస్ ఆమెకే దక్కింది. ప్రభాస్ కూడా వరుసగా రెండవసారి మోస్ట్ పాపులర్ సెలబ్రిటీల లిస్టులో మొదటి స్థానాన్ని దక్కించుకున్నారు. ఇక ప్రభాస్ తర్వాత స్థానంలో హీరోలలో విజయ్ దళపతి, వీళ్ళిద్దరి తర్వాత వరుసగా అల్లు అర్జున్, షారుక్ ఖాన్, ఎన్టీఆర్, అజిత్ కుమార్, మహేష్ బాబు, సూర్య, రామ్ చరణ్, అక్షయ్ కుమార్ స్థానాలను దక్కించుకున్నారు.
హీరోయిన్స్ విషయానికి వస్తే సమంత తర్వాత ఆలియా భట్, నయనతార, సాయి పల్లవి, దీపిక పదుకొనే, త్రిష , కాజల్, రష్మిక మందన, శ్రద్ధా కపూర్, కత్రినా కైఫ్ నిలిచారు. ఇక సమంత గత కొంతకాలంగా సినిమాలకు గ్యాప్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ మోస్ట్ ట్రెండింగ్ సెలబ్రిటీగా వైరల్ అవుతున్న ఈ ముద్దుగుమ్మ.. తిరిగి రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతుంది. ఇటీవల సిటాడల్ వెబ్ సిరీస్ లో నటించింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రస్తుతం ఈ సిరీస్ ట్రైనింగ్ అవుతుంది. ఇక సమంత ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం తనకు సంబంధించిన ఏదో ఒక పోస్ట్ తో ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇస్తుంది. ఈ క్రమంలోనే అమ్మడు మోస్ట్ పాపులర్ సెలబ్రిటీల జాబితాలో మొదటి స్థానాన్ని దక్కించుకుంటూ వస్తున్నారు.