సినీ ఇండస్ట్రీలో కొన్ని కొన్ని కాంబినేషన్స్ వస్తే బాగుండని ఆడియన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. అలా మోస్ట్ ఈగర్ గా తెలుగు ఆడియన్స్ ఎదురు చూస్తున్న కాంబినేషన్లలో నందమూరి నటసింహం బాలకృష్ణ, మిల్కీ బ్యూటీ తమన్న కాంబినేషన్ కూడా ఉంటుంది. వారి కాంబినేషన్లో సినిమా వస్తే చూడాలని ఎంతోమంది నందమూరి అభిమానులతో పాటు.. టాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఆశ పడుతూ ఉంటారు. ఇక టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలుగా దూసుకుపోతున్న చిరు, వెంకటేష్, నాగార్జున, బాలయ్య నలుగురిలో కేవలం బాలయ్య తో తప్ప తమన్న మిగతా ముగ్గురు స్టార్ హీరోస్‌తోను నటించి ఆకట్టుకుంది.
అంతేకాదు.. నందమూరి హీరోలుగా మంచి క్రేజ్‌తో దూసుకుపోతున్న తారక్, కళ్యాణ్ రామ్ తో కూడా తమన్నా మెరిసింది. కానీ.. బాలయ్యతో మాత్రమే ఇప్పటివరకు స్క్రీన్ షేర్ చేసుకోలేదు. నిజానికి భగవంత్ కేసరి సినిమా టైంలో తమన్నను ఓ ఐటెం సాంగ్ కోసం అడిగారంట వార్తలు వైరల్ అయ్యాయి. తమన్నా వాటిపై రియాక్ట్ అవుతూ ఆ వార్తలన్నీ ఫేక్ అని.. బాలయ్య సినిమాలో అవకాశం వస్తే నటించాలని నేను కూడా ఎదురు చూస్తున్నాను అంటూ వివరించింది. అయితే ఈ క్రమంలో బాలయ్య – తమన్న కాంబోలో సినిమా రాకపోవడానికి కారణం అదేనంటూ ఓ న్యూస్ వైరల్ గా మారుతుంది.
ఇకపై కూడా విళ్ళిద్దరి కాంబోలో సినిమా వచ్చే అవకాశం లేదంటూ నందమూరి ఫ్యాన్స్ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. దీని వెనుక పెద్ద సెంటిమెంట్ ఉందట. ఆ బాడ్ సెంటిమెంట్ కారణంగా వీరిద్దరి కాంబినేషన్లో సినిమా ఇప్పటికి వరకు రాలేదు.. ఇక పై కూడా రాదంటూ అంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అదేంటంటే.. తారక్, తమన్నా ఊసరవెల్లి సినిమాలో కలిసి నటించగా ఈ మూవీ ఫ్లాప్‌గా నిలిచింది. అంతే కాదు కళ్యాణ్ రామ్, తమన్నా కాంబినేషన్లో నా నువ్వే సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ అందుకోలేకపోయింది. ఈ క్రమంలోనే నందమూరి హీరోలకు తమన్నా అసలు అచ్చురాలేదని.. ఎన్టీఆర్, కళ్యాణ్రామ్ ఇద్దరికీ తమన్నా ఫ్లాప్స్ ఇచ్చిందని.. దీంతో బాలయ్య తమన్న కాంబినేషన్లో సినిమా రావడం కష్టమే అంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.