సంధ్య థియేటర్ రేవతి ఇష్యూ పై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్సెస్ అల్లుఅర్జున్ మధ్య పంచాయతీ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి క్రమంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ నెటింట హాట్ టాపిక్‌గా మారుతున్నాయి. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ సంచలన ప్రకటన చేశారు. టాలీవుడ్ ఇండస్ట్రీ ఏపీకి తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారంటూ వార్తలు ట్రెండ్ అవుతున్నాయి. హైదరాబాదులో ఉన్న టాలీవుడ్ ప్రముఖులు, పెద్దలు ఇండస్ట్రీకి సంబంధించినవారు ఒకసారి ఆంధ్రప్రదేశ్‌కు రావాలని ఆయన కోరారు.
ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం గిరిజన ప్రాంతాలను పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. డిప్యూటీ సీఎం గా తన బాధ్యతలను నిర్వర్తిస్తూనే.. మరో పక్కన సమయం దొరికినప్పుడు షూటింగ్‌లలో బిజీగా గడుపుతున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా సీతారామరాజు జిల్లా.. అనంతగిరి గిరిజన ప్రాంతాన్ని పర్యటించిన ఆయన.. అక్కడ అందాలను ఆస్వాదిస్తూ మంచుపడుతున్న క్రమంలో.. ఫోటోలకు స్టిల్స్ ఇస్తున్నాడు. అయితే ఇలాంటి నేపద్యంలో పవన్ కళ్యాణ్ కు ఒక మంచి ఐడియా తట్టిందట. ఆ ప్రాంతంలో సినిమాలు తీస్తే చాలా బాగుంటుందని.. ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే సినిమాలు తీయడానికి ఇది సరైన ప్రదేశం అంటూ ఇండస్ట్రీకి పిలుపునివ్వాలని పవన్ కళ్యాణ్ ఫిక్స్ అయ్యాడట.
ఇందులో భాగంగా.. తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీకి కీలక పిలుపునిచ్చినట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ సినిమా షూట్స్ ఏవైనా ఉంటే అందమైన ప్రదేశాలలో చేయాలనుకుంటే.. అల్లూరి సీతారామరాజు జిల్లా, అనంతగిరి కొండల్లో షూటింగ్ చేసుకోవాలని విజ్ఞప్తి చేశాడట. హైదరాబాదులో కంటే అద్భుతమైన సుందరమైన ప్రదేశాలు ఆంధ్ర ప్రదేశ్‌లో ఎన్నో ఉన్నాయని.. అవి సినిమా పరిశ్రమకు చాలా చక్కగా ఉపయోగపడతాయని.. వెంటనే టాలీవుడ్ పెద్దలందరికీ ఒకసారి ప్రదేశాన్ని వీక్షించాలని విజ్ఞప్తి చేసినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే రేవంత్ రెడ్డి వర్సెస్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మధ్య జరుగుతున్న వార్ క్రమంలో.. ఏపీ డిప్యూటీ సీఎం గా విధులు నిర్వర్తిస్తున్న పవన్ కళ్యాణ్ ఇలాంటి ప్రకటన చేయడం హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం ఆయన కామెంట్స్ నెటింట వైరల్‌గా మారుతున్నాయి.