ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సంధ్య థియేటర్ తొక్కిసులాట ఘటనలో అల్లు అర్జున్ పోలీసులు అరెస్ట్ చేయడం.. మరుసటి రోజు మద్యస్థర బెయిల్‌తో రిలీజ్ చేయడం అందరికీ తెలిసిందే. బన్నీని ఎలా అయినా ఒక రోజు జైల్లో పెట్టాలని పట్టుదలతో పోలీసులు ఉన్నారని ప్రచారం అప్పుడు గట్టిగానే వినిపించింది. అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్ట్ 14 రోజుల రిమాండ్ విధించడంతో.. వెంటనే చంచల్గూడా జైలుకు ఆయనను తరలించారు. తర్వాత హైకోర్టులో వాదనలతో అల్లు అర్జున్ కు మధ్యంతర బెయిల్ వచ్చింది. ఇక వెంటనే బన్నీని రిలీజ్ చేయాలని హైకోర్టు ఆదేశాలు పంపిన.. ఆయనను రిలీజ్ చేయడంలో పోలీసులు డిలే చేశారు. రాత్రి కచ్చితంగా విడుదల చేస్తారని అందరూ ఎదురుచూసినా.. అల్లు అరవింద్ కూడా పొద్దుపోయే వరకు జైలు వద్దనే ఉన్నా.. జైలు అధికారులు అక్కడ నుంచి వెళ్లిపోవడంతో శనివారం ఉదయం బన్నీ రిలీజ్ అయ్యాడు.
కాగా శనివారం ఉదయం చంచల్గూడా జైలు నుంచి బన్నీ రిలీజ్ అయిన తర్వాత.. ఆయన తరపున న్యాయవాది అశోక్ రెడ్డి మీడియాతో ముచ్చటించాడు. హైకోర్టు నుంచి ఆర్డర్ కాపీని జైలు అధికారులు స్వీకరించినా.. ఆయనను అక్రమ నిర్బంధంలో ఉంచారని చెప్పుకొచ్చిన ఆయన.. నిందితులను వెంటనే విడుదల చేయాలని హైకోర్టు తన ఉత్తర్వుల్లో స్పష్టంగా చేసిందని.. అయినా బన్నీని జైల్లో ఉంచారు అంటూ వెల్లడించాడు. ఆర్డర్ కాపీ అందుకున్న వెంటనే బన్నీని వాళ్ళు రిలీజ్ చేయలేదని.. ఫైర్ అయ్యారు. హైకోర్టు ఆర్డర్ చేరిన వెంటనే ఆయనను రిలీజ్ చేయండి అంటూ స్పష్టం చేసిందని.. అయినా బన్నీని రిలీజ్ చేయకుండా లేట్ చేశారంటూ ఆరోపించారు.
దీనిపై న్యాయవాదులు చట్టపరిమైన చర్యల కోసం పోరాడుతామని వెల్లడించారు. జైలు అధికారులు బయలు ఆర్డర్ అందడంతో ఎలాంటి జాప్యం లేదని.. తమ హైకోర్టు ఉత్తర్వుకు సంబంధించిన సర్టిఫైడ్ కాపీని వెంటనే సమర్పించామని లాయర్లు చెప్పుకొచ్చారు. హైకోర్టు మెసెంజర్ కూడా ఒక కాపీని అధికారులకు అందించామని వెల్లడిస్తుంటే.. జైలు అధికారుల వాదన మాత్రం మరోలా వినిపిస్తుంది. తమకు అర్ధరాత్రి వేళ ఆర్డర్ వచ్చిందని.. జైల్ మాన్యువల్ ప్రకారం ఖైదీలను రాత్రి టైంలో రిలీజ్ చేయమని.. మరుసటి రోజు ఉదయం నటుడిని రిలీజ్ చేశామంటూ చెప్పుకొస్తున్నారు. దీనితో జైల్ అధికారులపై కోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని అల్లు అరవింద్ పట్టుబడుతున్నాడట. ఎలాగైనా బన్నీ విషయంలో పోలీసులపై అరవింద్ రివేంజ్ తీర్చుకోవాలని చూస్తున్నాడని ఆప్పుడు జరుగుతున్న సంఘటనలతో క్లియర్ గా తెలుస్తోంది.