నో హీరోయిన్స్, నో డ్యాన్స్ చిరు నయా మూవీ.. మెగా ఫ్యాన్స్ ఒప్పుకుంటారా.. !

చిరంజీవి మెగాస్టార్‌గా ఎదగడానికి కారణం మొదటి నుంచి ఆయన ఎంచుకుంటున్న కంటెంట్. సినిమాలో హీరోయిన్లు అంద‌చందాలు, అదిరిపోయే బీట్స్, అద‌ర‌హో అనిపించే స్టెప్స్, అలాగే టైమింగ్ తగ్గట్టు ఆయన పవర్ఫుల్ డైలాగ్స్.. ఇలా త‌ను న‌టించే ప్రతి సినిమాను బ్యాలెన్స్ చేసుకుంటూ ఆడియన్స్‌ను మెప్పించి మెగాస్టార్ రేంజ్ కు ఎదిగాడు చిరు. కానీ.. తాజాగా మెగాస్టార్ వీటిని లెక్కచేయకుండా ప్రయోగాత్మక సినిమాకు సిద్ధమవుతున్నాడని టాక్.

ప్రస్తుతం చిరంజీవి విశ్వంభ‌ర సినిమాతో ఆడియ‌న్స్‌ను ప‌ల‌క‌రించ‌డానికి సిద్ధ‌మౌతున్న‌ సంగతి తెలిసిందే. ఈ సినిమా మే 9న గ్రాండ్ లెవెల్‌లో రిలీజ్ కానుంది. తర్వాత.. అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో మరో సినిమా చేయనున్నాడు. ఆ తర్వాత.. దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో చిరంజీవి సినిమా చేస్తున్నారు. ఈ సినిమా విషయంలోనే చిరు సరికొత్త ప్రయోగానికి ఓకే చేశాడని తెలుస్తోంది. ఈ సినిమా కమల్ హాసన్.. విక్రమ్ సినిమా తరహాలో ఉండబోతుందట‌.

ఇందులో ఫైట్లు తప్ప.. డాన్స్లు, హీరోయిన్తో రొమ్యాన్స్‌, కామెడీ ఏవి ఉండవని.. చిరు క్యారెక్టర్ చాలా ఇంట్రన్స్ గా ఉండబోతుందని సమాచారం. ఇక ఈ సినిమాల్లో మెగా క్యారెక్టరైజేషన్ చాలా అద్భుతంగా ఉంటుందట‌. కానీ.. మెగాస్టార్ మార్క్ మూవీ అంటే అదిరిపోయే స్టెప్స్, ఇద్దరు స్టార్ హీరోయిన్స్, పవర్ ఫుల్ డైలాగ్స్ ఇవన్నీ ఉండాల్సిందే. ఇలాంటి క్రమంలో.. మెగాస్టార్ ఇంటెన్స్ మూవీని ఆడియన్స్ ఒప్పుకుంటారో.. లేదో.. సినిమా మెగా ఫాన్స్‌ను మెప్పిస్తుందో లేదో వేచి చూడాలి.