‘ పుష్ప 2 ‘ ది రూల్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. కానీ చిన్న ట్విస్ట్.. !

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. రష్మిక మందన హీరోయిన్గా నటించిన తాజా మూవీ పుష్ప 2. సుకుమార్ డైరెక్షన్ లో తెర‌కెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్లపరంగా దూసుకుపోతూ రికార్డులు క్రియేట్ చేస్తున్న సంగతి తెలిసిందే. కేవలం ఆరు రోజుల్లోనే రూ.1000 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టిన మొట్టమొదటి సినిమాగా రికార్డులు క్రియేట్ చేసిన ఈ మూవీ.. బాలీవుడ్ లోనూ తన సత్తా చాటుకుంటుంది. ఇప్పటివరకు ఏ టాలీవుడ్ సినిమా అందుకోలేని సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తుంది. ఇలాంటి క్రమంలోనే పుష్ప 2 ఓటీటీ రిలీజ్ డేట్ పై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

మరోసారి తమ ఫేవరెట్ హీరో సినిమాను ఓటీటీ వేదికగా చూడాలని ఆరాటపడుతున్నారు అభిమానులు. అయితే సాధారణంగా ఇలాంటి పెద్ద సినిమాలు రిలీజ్ అయిన 40 నుంచి 50 రోజుల్లో ఓటీటీ స్ట్రీమ్ అవుతాయని తెలిసిందే. కాగా.. పుష్ప 2 ఓటీటీ రిలీజ్ డేట్ లో మాత్రం చిన్న ట్విస్ట్ నెలకొంది అని తెలుస్తుంది. ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌ భారీ ధరకు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది 2025 జనవరి 9న ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుందట.

అయితే.. మొదట ఈ సినిమాను సౌత్ ఇండియన్ వెర్షన్‌లో రిలీజ్ చేసి.. తర్వాత కొద్ది రోజులకు హిందీ వర్షన్‌ను రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. దాంతో ఈ సినిమా క్రేజ్ విపరీతంగా ఉండడంతో.. అక్కడ ఓటీటీ రిలీజ్‌ను లేట్ చేయనున్నారని.. అలాగే అక్కడ సినిమా పరిశ్రమ రూల్స్ ప్రకారం కూడా.. ఓటీటీ డేట్‌ని ఫిక్స్ చేసి.. ముందుకు వెళ్తారని సమాచారం. ఇక బాలీవుడ్‌లో దాదాపు పది రోజుల్లో ఏకంగా రూ.507.50 కోట్ల నెట్ వసూళ్లను కొల్లగొట్టిందని తెలుస్తుంది. హిందీలో అత్యంత వేగంగా రూ.500 కోట్ల క్లబ్ లోకి చేరిన మొదటి సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసిన పుష్ప 2 ఇప్పటికీ రికార్డులు పరంపర కొనసాగిస్తునే ఉంది.