” గేమ్ ఛేంజర్ ” కోసం దిల్ రాజు మరో రిస్క్.. మ్యాటర్ ఏంటంటే..?

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సక్సెస్ఫుల్ కంటెంట్ ని ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక బ్రాండ్ వాల్యూ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆయన ప్రొడ్యూస్ చేసిన సినిమాలు బలమైన కథ ఉండేలా ఆయన చూసుకుంటూ ఉంటారు. అయితే గత కొంతకాలంగా దిల్ రాజు తెర‌కెక్కిస్తున్న సినిమాలు ఏవి ఊహించిన రేంజ్‌లో సక్సెస్ కావడం లేదు. ఈ క్రమంలోనే సంక్రాంతి బరిలో రెండు భారీ సినిమాలు రిలీజ్‌కు సిద్ధమవుతున్నాయి. ఒకటి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కనున్న గేమ్ ఛేంజ‌ర్ కాగా.. మరొక సీనియర్ స్టార్ హీరో వెంకటేష్ ప్రధాన పాత్రలో కనిపించిన సంక్రాంతికి వస్తున్నాం. ఈ రెండు సినిమాలు సంక్రాంతి బరిలో ప్రేక్షకులను పలకరించనున్నాయి. ఇక శంక‌ర్ డైరెక్షన్ తెరకెక్కనున్న గేమ్ ఛేంజ‌ర్‌ పాన్ ఇండియా లెవెల్‌లో రిలీజ్‌కు సిద్ధమవుతుంది.

ఇక దిల్ రాజు ఈ ప్రాజెక్టుపై విపరీతమైన అంచనాలు పెట్టుకున్నారని.. రూ.200 కోట్లకు పైగా బడ్జెట్‌తో రూపొందించిన ఈ సినిమాను.. దేశవ్యాప్తంగా ప్రమోట్ చేయాలని ఆయన ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది. గేమ్ ఛేంజ‌ర్‌ కోసం దిల్ రాజు సరికొత్త రిస్క్ చేయబోతున్నాడట. చాలా సందర్భాల్లో ఆయన ప్రమోషన్లకు అతి తక్కువగా ఖర్చు చేస్తూ సింపుల్ గా ప్రమోషన్స్ కానిచేస్తాడు. కానీ.. ఈసారి మాత్రం పెద్ద మార్పులు చేసి మరి గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్‌ను భారీ లెవెల్‌లో చేసేందుకు సిద్ధమవుతున్నాడట. పాన్ ఇండియా లెవెల్ సినిమా అంటే కచ్చితంగా సినిమాపై మొదటి నుంచే మంచి క్రేజ్ ఏర్పడాలి. ముఖ్యంగా నార్త్ ఇండియాలో ఈ సినిమా కోసం పెద్ద కాంపౌండ్ ప్లాన్ చేశాడని.. ఆయనతో పాటు టీం గేమ్ ఛేంజ‌ర్‌ అంతర్జాతీయ లెవెల్‌కు తీసుకువెళ్ళ‌నున్నారని తెలుస్తోంది.

Game Changer Pre-release event : r/tollywood

ఇప్పటికే డల్లాస్‌లో మెగా ఫ్రీ రిలీజ్ ఈవెంట్‌ను టీం ఫిక్స్ చేసేసారు. ఈ ఈవెంట్లో రామ్ చరణ్ తో పాటు.. టీం కూడా సందడి చేయనున్నారు. దీంతో పాటే.. విదేశాల్లో పలు భారీ నగరాల్లో ఈవెంట్స్ నిర్వహించడానికి మొట్ట మొదటిసారి దిల్ రాజు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని.. ఈ ప్రోగ్రాం కోసం భారీ బడ్జెట్ కేటాయించనున్నట్లు తెలుస్తుంది. కేవలం ప్రమోషన్ల ఖర్చులే రూ.15 కోట్ల వరకు అయ్యే అవకాశం ఉందట. దీంతోపాటు.. దేశవ్యాప్తంగా ఐదు ప్రధాన నగరాల్లో సరికొత్త తరహాలో ప్రమోషన్స్ జరగనున్నాయని తెలుస్తోంది. జనవరి ఫస్ట్ వీక్ లో స్టార్ట్ కానున్న ఈ కాంపౌండ్‌లో చరణ్ పలు నగరాల్లో అభిమానులతో సందడి చేయనున్నాడని.. ఈ ఈవెంట్స్ ద్వారా సినిమా పబ్లిసిటీ నేషనల్ రేంజ్‌లో ఉండేలా దిల్ రాజు ప్లాన్ చేస్తున్నాడు. ఇక దిల్ రాజు నిర్ణయానికి మొదటి కారణం పుష్ప 2 ప్రమోషనల్ క్యాంపైన్. మైత్రి మేకర్స్ ఈవెంట్స్, ప్రమోషన్స్ ప్లాన్స్ సినిమాని జాతీయస్థాయిలో తీసుకువెళ్లడమే కాదు.. ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చాయి. దీంతో దిల్ రాజు కూడా అదే ఫార్ములాను గేమ్ చేంజర్ కోసం వాడబోతున్నట్లు సమాచారం.