టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతమంది సార్ డైరెక్టర్‌లుగా ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే.. వారు తర్కెక్కించిన ప్రతి సినిమా ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంటుందంటే మాత్రం నమ్మకం ఉండదు. కానీ.. ఒక్క దర్శక ధీరుడు రాజమౌళి మాత్రం తను చేసిన ప్రతి సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుని తిరుగులేని డైరెక్టర్‌గా ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు. ఎంతోమంది దర్శకులుగా అడుగు పెట్టాలనుకునే వారికి ఇన్స్పిరేషన్ గా నిలిచాడు. ఇక ప్రస్తుతం రాజమౌళి.. ఓ పాన్ వరల్డ్ సినిమా రూపొందించడానికి సిద్ధమవుతున్నాడు.
ఈ సినిమాతో ఎలాంటి సంచలనం సృష్టిస్తాడు వేచి చూడాలి. అయితే సినిమాని రూ.1300 కోట్ల బడ్జెట్ తో రూపొందించినట్లు సమాచారం. ఇప్పటికే సినిమా షూట్ మొదలవటానికి మరింత లేటవుతుంది అంటూ ఎన్నో వార్తలు వినిపించాయి. ఇలాంటి క్రమంలో సంక్రాంతి తర్వాత సినిమా సెట్స్ పైకి రానుందని టాక్ నడుస్తుంది. అయితే జక్కన్న.. మహేష్ కాంబోలో కేవలం హీరోగా మహేష్ బాబుని తప్ప.. మిగతా ఏ కాస్ట్ అండ్ క్రూని ఆయన రివీల్ చేయలేదు.
తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో నటించబోయే ఆర్టిస్టులు ఎవరో జక్కన్న సంక్రాంతి రోజున రివీల్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇక రాజమౌళి ఏదైనా సినిమాను తెరకెక్కించాలంటే.. దాని అవుట్ పుట్ చాలా పగడ్బందీగా ప్లాన్ చేస్తాడు. ఈ క్రమంలోనే ఆర్టిస్టులను అనౌన్స్ చేసే విషయంలో కూడా ఆయన ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారని.. పెద్ద పెద్ద స్టార్ సెలబ్రిటీస్ ఈ సినిమాలో భాగం కాబోతున్నారని సమాచారం. ఇండియాలో ఉన్న ఫేమస్ ఆర్టిస్టులు అంత ఈ సినిమాలో ఉండనున్నారట. ముఖ్యంగా నార్త్ ఆర్టిస్టులు ఎక్కువగా సినిమాలో కనిపించడానికి స్కోప్ ఉందని తెలుస్తుంది.