టాలీవుడ్ ఇండస్ట్రీలో కనీవినీ ఎరుగని రేంజ్‌లో సక్సెస్ అందుకుంటూ.. తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుని ముందుకు సాగుతున్న హీరోలలో అల్లు అర్జున్ ఒకడు. తాజాగా పుష్ప 2 సినిమాతో.. తనదైన రీతిలో సత్తా చాటుకున్న బన్నీ.. ఈ సినిమాతో ఏకంగా రూ.1500 కోట్లకు పైగా కలెక్షన్లు కొల్లగొట్టాడు. ఇలాంటి క్రమంలోనే బాహుబలి 2 సినిమా రికార్డులను పుష్ప 2 బ్రేక్ చేస్తుందంటూ ఫ్యాన్స్ గట్టి నమ్మకంతో ఉన్నారు. ఇప్పటివరకు అతి తక్కువ రోజుల్లో ఇంతటి కలెక్షన్ సాధించిన సినిమాగా పుష్ప 2 రికార్డు క్రియేట్ చేసింది.
ఇలాంటి క్రమంలో.. బాహుబలి 2 రికార్డును పుష్ప 2 బ్రేక్ చేయడం అంటే సాధారణ విషయం కాదు. రూ.1900 కోట్ల భారీ కలెక్షన్ కొల్లగొట్టిన బాహుబలి 2 సినిమా రికార్డును పుష్ప 2 బ్రేక్ చేయాలంటే.. పుష్ప 2 ఇంకా రూ.400 కోట్ల కలెక్షన్లు రాబట్టాల్సి ఉంది. ఇక పుష్ప 2 నుంచి కలెక్షన్లు హైప్ అయితే రికార్డులను బ్రేక్ చేయడం సాధ్యమవుతుంది. కానీ తగ్గితే మాత్రం అ రికార్డు టచ్ చేయడం చాలా కష్టం అవుతుంది అనడంలో సందేహం లేదు.
ఇక ఎట్టకేలకు పుష్ప 2 సినిమా.. ఇప్పటికే ఎవరు సాధించలేని రికార్డులను క్రియేట్ చేసింది. ఇండియాలోనే టాప్ 3 పొజిషన్ లో నిలిచిన ఈ సినిమా.. ముందు ముందు బాహుబలి రికార్డును, అలాగే దంగల్ సినిమా రికార్డ్ను కూడా బ్రేక్ చేస్తుందో లేదో తెలియాలి. ఒకవేళ అల్లు అర్జున్ ఈ రెండు సినిమాల రికార్డును బ్రేక్ చేస్తే.. ఇండియాలోనే వన్ ఆఫ్ ది టాప్ హీరోగా అల్లు అర్జున్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంటాడు. అలాగే తన సినిమా ఇండియాలోనే హైయెస్ట్ కలెక్షన్‌లు కొల్లగొట్టిన సినిమాగా నెంబర్ 1 పొజిషన్‌లో నిలుస్తుంది.