నందమూరి నటసింహం బాలయ్య హీరోగా.. బాబీ డైరెక్షన్‌లో రూపొందిన డాకు మహారాజ్ సినిమా.. సంక్రాంతి కానుకగా ఆడియన్స్‌ను పలకరించింది. ప్రగ్యా జైశ్వాల్ హీరోయిన్గా.. శ్రద్ధ శ్రీనాథ్, చాందిని చౌదరి కీలక పాత్రలో కనిపించనున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో జనవరి 12న గ్రాండ్ లెవెల్‌లో ఆడియన్స్ ముందుకు రానుంది. ఇందులో భాగంగానే.. సినిమా నుంచి ప్రమోషన్ కంటెంట్ రిలీజ్ చేస్తున్నాడు బాబి. ఇటీవల సినిమా నుంచి వచ్చిన టీజర్ రిలీజై ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో.. సినిమాపై విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. ఎప్పుడెప్పుడు సినిమా చూద్దామా అంటూ బాలయ్య అభిమానులతో పాటు.. సాధారణ టాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తున్నారు.
ఇక ఈ సినిమాతో మరోసారి సక్సెస్ అందుకొని డబల్ హ్యాట్రిక్‌కు బాలయ్య నాంది పలకడం ఖాయం అంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ చేయడంలో టీం సక్సెస్ అయ్యారు. ముందు ముందు సినిమాకు మరింత పబ్లిసిటీ వచ్చే అవకాశం ఉందని సమాచారం. యూనిట్ సభ్యుల ద్వారా అందుతున్న వార్తల ప్రకారం.. 2 గంటల 45 నిమిషాల పాటు సినిమా ఉండనుందని.. ఈ మధ్యకాలంలో స్టార్ హీరోల సినిమాలు మూడు గంటలు అంతకుమించి తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కానీ.. బాలయ్య సినిమా విషయంలో మాత్రం అంత రిస్క్ తీసుకోవడం లేదట. సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా.. అక్కడక్కడ ల్యాగ్ ఉందంటూ కొన్ని సినిమాలకు విమర్శలు ఎదురవుతున్నాయి.
ఈ క్రమంలో.. సినిమా విషయంలో అలాంటి టాక్ రాకుండా.. ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారని.. ఇందులో భాగంగానే సినిమాను 2 గంటల 45 నిమిషాల్లో నడివి మాత్రమే ఉండేలా చూసుకున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ డైరెక్టర్గా వ్యవహరించారు. సినిమా నుంచి ఫస్ట్ సింగిల్.. తాజాగా ఆడియన్స్ ముందుకు వచ్చి.. అత్యధిక వ్యూస్‌తో రికార్డ్ క్రియేట్ చేస్తుంది. ఇక.. బాలయ్య నుంచి గతంలో వచ్చి హ్యాట్రిక్ హీట్ కొట్టిన మూడు సినిమాలకు కూడా థమన్ మ్యూజిక్ అందించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బాలయ్య మరోసారి డాకు మహారాజ్ బ్లాక్ బస్టర్ కొట్టడం ఖాయం అంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అంతే కాదు ఈ సినిమాలో ఓ యంగ్ హీరో గస్ట్ అపీరియన్స్ ఉండబోతుందని.. హీరో పాత్ర సినిమాకు మరింత ప్రత్యేకంగా మారనుందని సమాచారం.