బాబీ నెక్ట్స్‌ మూవీ చేసేది ఆ స్టార్ హీరోతోనేనా.. మరో బ్లాక్ బస్టర్ పక్కా..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది డైరెక్టర్లుగా అడుగుపెట్టి.. తమకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకోవాలని ఆరాటపడుతున్నారు. అలాంటి వారిలో టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ బాబి కొల్లి కూడా ఒకరు. గతంలో సీనియర్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవితో ఓ సినిమాలో తెర‌కెక్కించి బ్లాక్ బస్టర్ అందుకున్న బాబి.. ప్రస్తుతం మరో స్టార్ హీరో బాలయ్యతో డాకు మహారాజ్ సినిమా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం బాబి అహర్నిశలు కష్టపడుతున్నట్లు తెలుస్తుంది.

సంక్రాంతి బరిలో రిలీజ్ అయ్యే ఈ సినిమాతో తనకంటూ ప్రత్యేకమైన ఐడెంటిటీని క్రియేట్ చేసుకోవాలని.. మరోసారి సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకోవాలని కసితో ఉన్నాడ‌ట. బాలయ్య కూడా.. మరోసారి డాకు మహారాజ్‌గా తన సత్తా చాటుకుని మ‌రో హ్యాట్రిక్‌కు నాంది పలకాలని ప్రయత్నాల్లో ఉన్నాడు. ఇక.. ఈ సినిమా తర్వాత బాబి నెక్స్ట్ మూవీ ఎవరితో ఉండనుందని ఆసక్తి అభిమానుల్లో మొదలైంది. ఈ క్రమంలోనే బాబి పాన్ ఇండియ‌న్‌ నెంబర్ వన్ స్టార్ హీరోగా దూసుకుపోతున్న ప్రభాస్ తో సినిమా చేయబోతున్నాడు అంటూ ఓ న్యూస్ నెటింట‌ వైరల్‌గా మారుతుంది. ఇప్పటికే బాబీ.. ప్రభాస్‌ని కలిసారని.. ఆయనకు కథ కూడా వినిపించినట్లు తెలుస్తుంది.

Prabhas gets hospitalised, undergoes surgery

కమర్షియల్ సినిమాలతో సక్సెస్ అందుకుంటున్న బాబీ.. ప్రభాస్‌తో కూడా అలాంటి ఓ క‌మ‌ర్షియ‌ల్‌ సినిమా రూపొందించాలని ప్రయత్నాల్లో ఉన్నాడట. ఇక ఈ కథకు.. ప్రభాస్‌ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని.. హోల్డ్ లో పెట్టినట్లు తెలుస్తుంది. ప్రభాస్ లైనప్‌ చాలా పెద్దగా ఉండడంతో బాబి డైరెక్షన్‌లో ప్రభాస్ సినిమా చేసే అవకాశం ఉందా.. లేదా.. అనేదానిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వీరిద్దరి కాంబోలో సినిమా ఉంటుందంటూ సన్నిహిత వర్గాలు సమాచారం. మరి వీళ్ళ కాంబినేషన్లో నిజంగా సినిమా వస్తే మాత్రం ఈ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంటున్న అనడంలో అతిశయోక్తి లేదు. ఇక మిర్చి టైంలో ప్రభాస్ ఎలా ఉన్నాడో.. అలాంటి ఓ కథతో మరోసారి ప్రభాస్‌ని బాబి చూపించాలని ప్రయత్నిస్తున్నాడట.