ప్రభాస్ ఫ్యాన్స్ కు వెరీ వెరీ బ్యాడ్ న్యూస్.. ఏం జరిగిందంటే..?

టాలీవుడ్ రెబ‌ల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఫుల్ ఫామ్‌లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే వరుస‌ సినిమాలను లైన్‌లో పెట్టుకుంటున్న ప్రభాస్.. ప్రస్తుతం రాజాసాబ్ సినిమాతో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా వచ్చే ఏడది ఏప్రిల్ 10న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ గతంలోనే అనౌన్స్ చేశారు. అయితే ఎప్పుడెప్పుడు ప్రభాస్ సినిమా రిలీజ్ అవుతుందా.. ఎప్పుడెప్పుడు చూద్దామా అంటూ ఎదురు చూస్తున్న ఫ్యాన్స్‌కు ఇది బ్యాడ్ న్యూస్ అనడంలో అతిశయోక్తి లేదు. ఇంత‌కి మ్యాట‌ర్ ఏంటంటే.. ఈ సినిమా వాయిదా పడనుందట‌. అఫీషియల్ గా మేకర్స్ ఈ విషయాన్ని వెల్లడించకపోయినా.. దాదాపు వాయిదా పడినట్లే అని సమాచారం.

The Raja Saab - Wikipedia

దీనికి కారణం హీరో సిద్దు జొన్నలగడ్డ అదే తేదీన కొత్త సినిమాతో ఆడియన్స్‌ను పలకరించడానికి సిద్ధమవుతుండ‌ట‌మే. తాజాగా దీనిపై అఫీషియల్ ప్రకటన కూడా వచ్చింది. టిల్లు, టిల్లు స్క్వేర్ సినిమాలతో బ్లాక్ బస్టర్ సక్సెస్ లో అందుకుని మంచి క్రేజ్ సంపాదించుకున్న సిద్దు.. బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్లో జాక్‌ సినిమాలో నటిస్తున్నాడు. బేబీ ఫేమ్.. వైష్ణవి చైతన్య హీరోయిన్గా రూపొందుతున్న ఈ సినిమా.. షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ క్రమంలోనే సినిమాలు ఏప్రిల్ 10న రిలీజ్ చేస్తున్నామంటూ మేకర్స్ అఫీషియల్‌గా ప్రకటించారు. దీంతో రాజాసాబ్ వాయిదా గురించి వీళ్ళకి ఫుల్ క్లారిటీ వచ్చేసిందని.. అందుకే అంత డేర్‌గా డేట్ ను అనౌన్స్ చేశారని తెలుస్తుంది.

రాజాసాబ్‌ వాయిదాకు ప్రభాస్ గాయం ప్రధాన కారణమట. రెండు రోజుల క్రితం చేయలమండ బెనికిందంటూ ఓ న్యుస్ వైరల్ అయిన సంగతి తెలిసిందే. దీనికి సర్జరీ చేయించుకునేందుకు త్వరలో ప్ర‌భాస్ ఫార‌న్ వెళ‌నున్నాడని.. ఈ క్రమంలోనే జనవరి చివరి వారం వరకు ప్రభాస్ ఇండియాలో ఉండ‌డ‌ని తెలుస్తుంది. అయితే ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాలేదట‌. విఎఫ్ ఎక్స్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పెండింగ్ లోనే ఉన్న క్రమంలో.. 2025 ఏప్రిల్ 10 సినిమా రిలీజ్ దాదాపు వాయిదా పడినట్లే అని టాక్‌.