సౌత్ స్టార్ బ్యూటీ కీర్తీ సురేష్.. ఒకప్పుడు మహానటి సినిమాతో ఎలాంటి క్రేజ్ సంపాదించుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే.. ఈ సినిమా తర్వాత మెల్లమెల్లగా అమ్మడికి అవకాశాలు నెమ్మదించాయి. తర్వాత.. అవకాశాలు దక్కించుకున్నా.. ముందున్నంత క్రేజ్ మాత్రం అమ్మడికి దక్కలేదు. చెప్పడానికి మహేష్ బాబు లాంటి స్టార్ హీరో సర్కార్ వారి పాట సినిమాల్లో కళావతి పాత్రలో నటించి కుర్రకారును ఆకట్టుకున్న.. ఊహించిన రేంజ్ లో సక్సెస్ మాత్రం అందుకోలేకపోయింది. దీంతో తర్వాత తెలుగులో ఎక్కువగా అవకాశాలే రాలేదు. మెగాస్టార్ సోదరి పాత్రలు కనిపించిన ఈ ముద్దుగుమ్మ.. టాలీవుడ్ జర్నీ విషయంపై ఓ క్లారిటీ తెచ్చుకుంది. దీంతో ఒక్కసారిగా బాలీవుడ్‌కు మక్కం మార్చేసిన కీర్తి.. అక్కడ అవకాశాల కోసం ప్రయత్నాలు మొదలు పెట్టింది.
అప్పటికే సమంత, తమన్నా లాంటి బాలీవుడ్ కి వెళ్లి కొన్ని సినిమాలతో పాటు వెబ్ సిరీస్లలోను నటిస్తూ బిజీ అయ్యారు. ఈ క్రమంలోనే వెనకడుగు వేయకుండా బాలీవుడ్ చెక్కేసింది. సరిగ్గా అదే టైంలో చిన్ననాటి స్నేహితుడు ఆంటోనీ తటిల్ ను వివాహం చేసుకొని అందరికీ షాక్ ఇచ్చింది. అయితే కీర్తి సురేష్ పెళ్లికి.. బాలీవుడ్ జర్నీకి అసలు సంబంధం ఏముంది.. అనుకుంటున్నారా. దీని వెనక ఓ పెద్ద కథ ఉందంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. పెళ్ళితో తనకొచ్చిన క్రేజ్‌ని తెలివిగా ఎన్ క్యాష్ చేసుకోవాలనే ఐడియాతోనే కీర్తి సురేష్ ఉందట. ఇక బాలీవుడ్‌లో కీర్తి.. బేబీజాన్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ఏకంగా అమ్మడు రూ. 5కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకుందట.
ఇక.. కమిట్ అయిన ఫ్యూచర్ ప్రాజెక్టులకు ఏకంగా రెమ్యూనరేషన్ రూ.5 నుంచి 6 కోట్లు తీసుకుంటుందని సమాచారం. అయితే.. తెలుగులో అమ్మడికి ఈ రేంజ్‌లో రెమ్యునరేషన్ అందలేదు. టాలీవుడ్ లో కేవలం సినిమాకు రూ.2 కోట్ల వరకు మాత్రమే రెమ్యూనరేషన్ ఉందని.. దీంతో పట్టే మరో కారణం తెలుగులో ఎంత రెమ్యూనరేషన్ ఇవ్వండని కీర్తి ఎవ్వరిని డిమాండ్ చేయలేదట. నిర్మాతలు రూ.2 కోట్లు లెక్క కట్టిస్తే తీసుకోవడం తప్ప.. ప్రత్యేకమైన డిమాండ్ ఏమీ చేయలేదని.. ఇప్పుడు బాలీవుడ్ లో కూడా డిమాండ్ ప్రపోజల్స్ ఏమీ లేకుండానే.. కేవలం సినిమాకు రూ.5 నుంచి రూ.6 కోట్లు రెమ్యూనరేషన్ ఇస్తున్నారని.. ఈ క్రమంలోనే కీర్తి తన ఫుల్ ఫోకస్ బాలీవుడ్ పై పెట్టినట్లు తెలిసింది. పెళ్లైన భామలకు బాలీవుడ్‌లో మంచి డిమాండ్ ఉండడంతో ఇది మరింత ప్లస్ అవుతుందని సమాచారం.