ప్రతి ఏడది బాక్సాఫీస్ దగ్గర ఎన్నో సినిమాలు సంక్రాంతి బరిలో పోటీ పడతాయన్న సంగతి తెలిసిందే. అంతే కాదు.. సంక్రాంతిలో రిలీజ్ అయ్యే సినిమాలకు సక్సెస్ రేట్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలోనే.. 2024 సంక్రాంతికి బాక్సాఫీస్ దగ్గర గట్టి పోటీ నెలకొంది. రెండు కాదు.. మూడు కాదు.. ఏకంగా నాలుగు తెలుగు స్ట్రైట్ సినిమాలు పొంగల్‌కు ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతున్నాయి. 2025 పొంగల్ సందర్భంగా బరిలోకి వస్తున్నాయంటూ ఏవేవో సినిమా పేర్లు మొదట వినిపించిన చివరకు నాలుగు సినిమాలు మాత్రం ఫైనల్ అయ్యాయి. వాటిలో మొదటి మెగా హీరో రామ్ చరణ్ గేమ్ చేంజర్. జనవరి 10న ఈ సినిమా రిలీజ్ కానుంది.
ఈ సినిమా తర్వాత గాడ్ ఆఫ్ మాసేస్ బాలయ్య డాకు మహారాజ్.. జనవరి 12న రిలీజ్ కానుంది. అంతే కాదు మరో సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం.. జనవరి 14న ఈ సినిమా పొంగల్ బరిలో దిగనుంది. అంతేకాదు కోలీవుడ్ హీరో అజిత్ విడమయ్యారు సినిమా కూడా అప్పుడే ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతుంది. దేంతో ఈ నాలుగు సినిమాల రన్ టైమ్ నెటింట ట్రెండ్ అవుతుంది. కోలీవుడ్ ప్రముఖ నిర్మాత శంకర్ దర్శకత్వంలో వస్తున్న గేమ్ ఛేంజర్ మూవీలో చరణ్ 2 విభిన్న పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే ప్రమోషన్స్ ద్వారా మంచి అంచనాల నెలకొల్పిన ఈ సినిమా నడివి 2 గంటల 50 నిమిషాలు అని తెలుస్తుంది.
ఇక హ్యాట్రిక్ సక్సెస్ తో దూసుకుపోతున్న బాలయ్య డాకు మహారాజ్ సినిమా.. రన్ టైమ్ 2 గంటల 45 నిమిషాలట. ఎఫ్ 2, ఎఫ్ 3 సినిమాలతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న అనిల్ రావిపూడి – వెంకటేష్ కాంబో మూవీ.. సంక్రాంతికి వస్తున్నాం. ఈ మూవీ రన్ టైం 2 గంటల 40 నిమిషాలు. ఇక పెరుకు కోలీవుడ్ హీరో అయిన టాలీవుడ్ లో ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న అజిత్.. విడముయర్చి సంక్రాంతి బరిలో 2 గంటల 45 నిమిషాల రన్ టైం తో రంగంలో దిగనుంది. అలా సంక్రాంతికి వచ్చే నాలుగు సినిమాలు మూడు గంటల లోపు రన్ టైం కలిగి ఉండడం ఇప్పుడు అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అయితే ఈ రన్ టైం సినిమాలకు ఎంత ప్లస్ అవుతుందో.. ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో వేచి చూడాలి.