మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆర్‌ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక దాదాపు 6 ఏళ్ల తర్వాత చరణ్ నుంచి సోలో మూవీ రాబోతుంది. వినయ విధేయ రామ తర్వాత చరణ్ నుంచి ఒక సోలో సినిమా కూడా రాలేదు.. ఆర్ఆర్ఆర్ లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తర్వాత చిరంజీవితో ఆయన ఆచార్య సినిమా నటించిన అది డిజాస్టర్ గా నిలిచింది. ఈ క్రమంలోనే అభిమానులంతా చరణ్ నుంచి ఓ పర్ఫెక్ట్ సోలో పాన్ ఇండియన్ మూవీ కోసం ఆసక్తిగా ఎదురు చూశారు. ఎట్టకేలకు ఆ సమయం రానే వచ్చింది. త్వరలోనే గేమ్ ఛేంజర్ ఆడియన్స్‌ను పలకరించింది. వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో.. జనవరి 15న సినిమా రిలీజ్ చేయనున్నారు.
ఈ క్రమం లేనే సినిమాపై ఇప్పటికే మెగా అభిమానుల్లో విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. శంకర్ లాంటి డైరెక్టర్‌తో చరణ్ సినిమా అంటే.. ఆ సినిమాపై ఆడియన్స్ లో ఏ రేంజ్ లో అంచనాలు ఉంటాయో తెలిసిందే. కానీ శంకర్ నుంచి చివరిగా తెరకెక్కిన ఇండియన్ 2 ఘోరమైన డిజాస్టర్ కావడంతో.. గేమ్ ఛేంజర్ సినిమాపై అభిమానుల్లో కాస్త సందేహాలు మొదలయ్యాయి. ఇప్పుడు ఈ సినిమాపై వచ్చే ప్రతి రూపాయి చరణ్ పేరు మీదనే వస్తుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో చరణ్‌కు ఉన్న క్రేజ్ రిత్య ఓపెనింగ్స్ దగ్గర నుంచి క్లోజింగ్ వరకు.. భారీ లెవెల్‌లో కలెక్షన్లు వస్తాయనడంలో అతిశయోక్తి లేదు. కానీ.. బాలీవుడ్ లో ఈ రేంజ్ వసూళ్ళు వస్తాయా.. లేదా.. అనేది పెద్ద సందేహంగా మారింది.
ఎందుకంటే హిందీలో కలెక్షన్లు రావడం సాధారణ విషయం కాదు. చాలా పారామీటర్స్ ఉండాలి. పుష్ప 2 సినిమా ఆరెంజ్ సంచలనం సృష్టించడానికి కారణం కూడా అక్కడ ఆడియన్స్ పార్ట్ 1 విపరీతంగా ఓన్ చేసుకోవడమే. కేవలం అల్లు అర్జున్ సినిమాకే కాదు.. బాలీవుడ్ ఆడియన్స్ సీక్వెల్స్‌కు చెవులు కోసుకుంటారు. లేడీ ఓరియంటెడ్ మూవీకి వచ్చిన స్త్రీ 2 సినిమాకి కూడా ఏకంగా రూ.1000 కోట్ల గ్రాస్ వచ్చింది అక్కడి ఆడియన్స్ సీక్వెల్స్ కి ఏ రేంజ్ లో భ్రమరధం పడతారో.. దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇక గేమ్ ఛేంజర్ సినిమాకు.. పుష్ప 2కి ఉన్నట్టు సీక్వెల్ క్రేజ్ లేదు. ఎంత వసూళ్లు వచ్చినా.. చరణ్ కోసమే ఆడియన్స్ రావాలి.
కానీ ఇద్దరు ఒకేరెంజ్ హీరోలు కాబట్టి.. పుష్ప 2 హిందీ వసూళతో గేమ్స్ ఛేంజర్ కలెక్షన్‌లు కంపేర్ చేస్తున్న ట్రేడ్ పండితులు.. పుష్ప 2 సినిమాకి హిందీలో మొదటి రోజు రూ.70 కోట్ల నెట్ వసూళ్లు రాగ.. గేమ్ ఛేంజర్‌కు ప్రస్తుతం ఉన్న క్రేజ్ రీత్యా.. రూ.10 కోట్ల నెట్ వసూళ్ళు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ఇక సినిమా నుంచి సరైన థియేట్రికల్ ట్రైలర్ పడితే.. ఆ కలెక్షన్ల రేటు రూ.20 కోట్లకు పెరగవచ్చని సమాచారం. ఇక సినిమాకు హిందీ వర్షన్ ఫ్రీ రిలీజ్ థియేటర్ బిజినెస్ రూ.40 కోట్ల వరకు జరిగింది అంటే.. ఫుల్ రన్‌లో కచ్చితంగా ఈ సినిమా హిందీలో రూ.100 కోట్ల గ్రాస్ ను కొల్లగొట్టాలి. మరియు సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో.. బాలీవుడ్ లో భారీ లాభాలను తెచ్చి పెడుతుందో.. లేదో.. వేచి చూడాలి.