సాధారణంగా నవంబర్ నుంచి డిసెంబర్ జనవరి నెలలో చాలామంది జనం అయ్యప్ప మాల, శివమాల , గోవింద మాల, భవాని మాల అంటూ ఇలా రకరకాలుగా మాలలు ధరిస్తూ దేవుడిని ఆచరిస్తూ ఉంటారు. ఆ తర్వాత అయ్యప్ప మాలవేసిన వాళ్ళు శబరిమల, శివమాల వేసిన వారు శ్రీశైలం, గోవింద మాల వేసిన వాళ్ళు తిరుపతి, భవాని మాల విజయవాడా ఇలా కొన్నిచోట్లకు వెళ్లి వారి విరిమడి చెల్లిస్తూ ఉంటారు. ఈ సంగతి పక్కన పెడితే సాధారణ వ్యక్తులతో పాటు.. సినీ ఇండస్ట్రీలో కూడా చాలామంది సెలబ్రిటీలు అయ్యప్పమాల ధరిస్తూ ఉంటారు. ముఖ్యంగా టాలీవుడ్ మెగా ఫ్యామిలీలో చిరంజీవి అయ్యప్ప మాల వేస్తూ ఉంటారు.
గతంలో చాలాసార్లు చిరు అయ్యప్ప మాలలో కనిపించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు చిరంజీవి తనయుడు రామ్ చరణ్ కూడా అయ్యప్ప మాల ధరిస్తూ వస్తున్నారు. ఎంత బిజీగా ఉన్నా.. ఏ సినిమాల్లో నటిస్తున్న.. విదేశాల్లో ఉన్నా కూడా చరణ్ అయ్యప్ప మాల ధరించడం మాత్రం మానలేదు. ఈసారి చరణ్ మాలలో పలు షోలకు, ఈవెంట్లకు కూడా హాజరైన సంగతి తెలిసిందే. అయ్యప్ప మాల ధరించి ఉన్న రాంచరణ్.. గేమ్ ఛేంజర్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా యూఎస్ కి వెళ్ళనున్నాడట. డల్లాస్ లో జరగబోతున్న భారీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి యూనిట్ సభ్యులతో కలిసి యుఎస్ ఫ్లైట్ ఎక్కనున్నారని.. మాలలోనే చరణ్ యూఎస్ వెళ్లబోతున్నట్లు సమాచారం. అయితే.. తిరిగి ఆయనా వచ్చేటప్పుడు మాత్రం అయ్యప్ప మాల లేకుండా రాబోతున్నాడని మెగా కాంపౌండ్ నుంచి వార్తలు వైరల్ అవుతున్నాయి.
తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం.. మాల విరమించిన తర్వాత ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొంటారని.. అయితే రెగ్యులర్గా అయ్యప్ప మాల వేసే చరణ్.. చాలా అరుదుగా మాత్రమే కేరళలో శబరిమల అయ్యప్ప స్వామి వారి దర్శనాన్ని చేసుకుంటారని తెలుస్తోంది. ఇంకా అయ్యప్ప మాల వేసుకున్న భక్తులంతా ఎక్కువగా శబరిమల వెళ్లి మాల తీసి వస్తూ ఉంటారు. కానీ.. చరణ్‌తో పాటు కొందరు సెలబ్రిటీలు మాత్రం.. తమకు వీలున్నచోట మాల విసర్జన చేయడం చూస్తూనే ఉన్నాం. ఈసారి చరణ అయప్ప మాల విసర్జన డల్లాస్ లోని దేవాలయంలో చేయబోతున్నాడట. అయితే ఈ తరం వాళ్లు అయ్యప్ప స్వామి మాల ధరించడం అది కూడా.. ఒక స్టార్ సెలబ్రిటీ అయి ఉండి ఎన్నో పనులు ఉంటాయి, ఎన్నో జర్నీలు చేస్తూ ఉండాలి.. వాటన్నింటినీ మేనేజ్ చేస్తూ ఇన్ని రోజులు మాలను కొనసాగించడం అనేది సాధారణ విషయం కాదు.