మనోజ్ ఓ అబద్దాలకోరు.. విష్ణు తప్పే లేదు.. మనోజ్ తల్లి షాకింగ్ లేఖ..

మంచు ఫ్యామిలీ వివాదం గ‌త‌ కొంతకాలంగా వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. గతవారం నుంచి వీళ‌ గొడవలు రచ్చకెక్కాయి. ఈ గొడవలు సద్దుమణిగాయి అనుకునే లోపే.. మంచు మనోజ్ మళ్ళీ గొడవలు లేవనెత్తాడు. మోహన్ బాబు భార్య నిర్మల దేవి బర్త్డే వేడుకలు చేద్దామని ఫ్రెండ్స్ తో చిన్న పార్టీ అరేంజ్ చేసుకుంటే.. మేం బయట నుంచి తెచ్చుకున్న జనరేటర్‌లో పంచదార పోసి మమ్మల్ని చంపేయాలని ప్రయత్నించాడని.. నా కుటుంబం పై హత్య ప్రయత్నం చేశాడని.. జనరేటర్ లో షుగర్ పోయడం వల్ల విద్యుత్ హెచ్చుతగ్గులు వచ్చి భయభ్రాంతులం అయ్యామంటూ పాహ‌డ్‌ షరీఫ్ పోలీస్ స్టేషన్ లో మనోజ్ ఆరోపణలు చేశాడు.

Manchu Manoj Biography: Age, Career, Wife, Marriage, Divorce, Awards, Photos

అయితే ఫిర్యాదు పై మనోజ్ తల్లి నిర్మల దేవి తాజాగా రియాక్ట్ అవుతూ.. సంచలన లేక రిలీజ్ చేశారు. నిర్మల దేవి రిలీజ్ చేసినా ఆ లేఖలో మనోజ్ తెచ్చిన జనరేటర్‌లో విష్ణు చెక్కర పోసాడంటూ.. మనోజ్ చేసిన ఫిర్యాదుల్లో ఏమాత్రం నిజం లేదు.. విష్ణు అలాంటి తప్పు ఏమీ చేయలేదు.. మనోజ్ అబద్ధాలు సృష్టించాడు. నా పుట్టినరోజు నాడు జలపల్లి లోని మా నివాసానికి విష్ణు వచ్చి నాతో కేక్ కట్ చేయించి.. మా ఇంట్లో ఉన్న తన వస్తువులను తీసుకువెళ్లాలని రూంలోకి వెళ్ళాడు. కానీ.. మనోజ్ మాత్రం జనరేటర్ లో చెక్కర పోసాడని ఫిర్యాదు చేస్తున్నాడు.. అందులో ఎలాంటి వాస్తవం లేదు. జల్‌ప‌ల్లిలో ఉన్న మా నివాసం మీద మనోజ్ కి ఎంత హక్కు ఉందో.. విష్ణు కి కూడా అంతే హక్కుంది.

నా పెద్ద కొడుకు అలాంటివాడు కానే కాదు అంటూ నిర్మల షాకింగ్ కామెంట్స్ చేసింది. వాడు.. తన మనుషులని పెట్టి ఎవరిపై దౌర్జన్యం చేయించలేదని.. ఎలాంటి గొడవలు చేయలేదంటూ రాసుకొచ్చిన నిర్మల.. తప్పంతా మనోజ్ దేనని. మనోజ్ చేసిన ఫిర్యాదుల్లో వాస్తవం లేదంటూ తేల్చేసింది. ఇక ఈ లేఖని ఫ‌హ‌డ్ ష‌రీఫ్ పోలీసులకు నిర్మల దేవి అందించారు. ప్రస్తుతం నిర్మల దేవి లేక మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. చాలామంది నెటిజ‌న్స్ తప్పంతా మనోజ్ దేనని లేనిపోని గొడవలు సృష్టిస్తున్నారని అభిప్రాయాలు వ్యక్తం చేస్తుంటే.. కొంతమంది సొంత తల్లి ఇలా మనోజ్ పై కంప్లైంట్ చేస్తుందంటే అదే నిజమై ఉంటుందంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.