చైతు శోభిత ప్రేమకు.. తెలుగు భాషకు ఇంత లింక్ ఉందా..?

అక్కినేని సామ్రాట్ నాగచైతన్య.. హీరోయిన్ శోభితను తాజాగా వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. పెళ్లి తర్వాత ఈ కొత్తజంట ఆంగ్ల మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులోనే వీరిద్దరి మధ్యన పరిచయం ప్రేమగా ఎలా మారిందో మాట్లాడారు. మొదటిసారి 2018 లో నాగార్జున ఇంటికి శోభిత వెళ్లినట్లు వెల్లడించింది. 2022లో ఏప్రిల్ తర్వాత నా స్నేహం మొదలైందని.. శోభిత వెల్లడించింది. 2022 ఏప్రిల్ నుంచి నాగచైతన్య త‌న‌ను ఇన్స్టాలో ఫాలో అవుతున్నట్లు చెప్పిన శోభిత.. నాకు ఫుడ్ అంటే చాలా ఇష్టమని, నేను చైతన్య ఎప్పుడు కలిసిన ఫుడ్ గురించి మా అభిప్రాయాలను షేర్ చేసుకునే వాళ్ళం అంటూ చెప్పుకొచ్చింది. అయితే కేవలం తెలుగులో మాట్లాడమని నాగచైతన్య ఎప్పుడు అడుగుతుండేవాడని.. అలా తెలుగులో మాట్లాడుకోవడం వల్ల మా బంధం బలపడిందని ఆమె వివరించింది.

Naga Chaitanya Reveals He Often Asks Sobhita Dhulipala To Talk To Him In Telugu: "It Just Drew Me Closer"

నేను ఎప్పుడూ ఇన్స్టాల్ లో యాక్టివ్ గా ఉంటా. అలాంటి క్రమంలో నేను పెట్టే గ్లామర్ ఫొటోస్ కాకుండా.. ఇన్స్పిరేషనల్ కథనాలు, అభిప్రాయాలకు సంబంధించిన పోస్టులకు నాగచైతన్య లైక్ చేసేవాడు. ఇక‌ మొదటిసారి ముంబైలో ఓ కేఫ్‌లో చైతన్యను కలిశాను అంటూ చెప్పుకొచ్చిన ఈ అమ్మ‌డు.. చైతు హైదరాబాద్, నేను ముంబైలో ఉండే వాళ్ళం. నా కోసం హైదరాబాద్ నుంచి చైతు ముంబై వచ్చారు. మొదటిసారి మేం బయటకు వెళ్ళినప్పుడు నేను రెడ్ డ్రెస్, చైతన్య బ్లూ సూట్ లో ఉన్నారు. ఆ తర్వాత కర్ణాటకలోని ఓ పార్క్‌కు వెళ్ళాం. అక్కడ కొంత టైం గడిపిన తర్వాత ఒకరికొకరం గోరింటాకు పెట్టుకున్నాం. ఆ తర్వాత అమెజాన్ ప్రైమ్ ఈవెంట్‌కు వెళ్లి వచ్చాం. అప్పటినుంచి మిగతాదంతా అందరికీ తెలిసిన విషయమే అంటూ శోభిత వెల్లడించింది.

I was in a red dress; he was in a blue suit,"

నాగచైతన్య కుటుంబం న్యూ ఇయర్ వేడుకలు జరుపుకుంటున్న క్రమంలో.. తనను ఆహ్వానించారని చెప్పిన శోభిత.. ఆ మారుస‌ట్టి సంవ‌త్స‌రం తన కుటుంబాన్ని చైతన్య కలిసినట్లు చెప్పుకొచ్చింది. ఒకరినొకరు అర్థం చేసుకున్న తర్వాత.. ఈ ఏడాది గోవాలో పెళ్లి ప్రతిపాదన తీసుకువచ్చినట్లు వెల్లడించింది. ఇక నాగచైతన్య మాట్లాడుతూ.. శోభిత‌ను తెలుగులో మాట్లాడమని నేను ఎప్పుడూ అడిగా వాడిని. సినీ ఇండస్ట్రీలో ఎన్నో భాషల్లో మాట్లాడే వ్యక్తులు ఉంటారు. కానీ.. తెలుగులో మాట్లాడే వారిని చూస్తే నాకు ముచ్చట అనిపిస్తుంది. వాళ్లతో త్వరగా కనెక్ట్ అయిపోతా. శోభిత‌తో పరిచయం త‌ర్వాత‌ నాతో తెలుగులోనే మాట్లాడాలని కోరుకునేవాడిని అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం వీరిద్దరి కామెంట్స్ వైర‌ల్ అవ్వ‌డంతో వామ్మో చైతు, శోభిత‌ ప్రేమకు.. తెలుగు భాషకు ఇంత‌ లింక్ ఉందా అంటూ ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్.