పొలిటీషియన్ ఇంటికి అల్లుడు కాబోతున్న ప్రదీప్.. అధికార కూటమి పిల్లనే పడేసాడే..

బుల్లితెర స్టార్ యాంకర్ ప్రదీప్ మాచ‌రాజుకు టాలీవుడ్‌లో ప్ర‌త్యేక పరిచయం అవసరం లేదు. తన హుషారు, కామెడీ టైమింగ్, మాట తీరుతో అందరిని ఆకట్టుకున్న ఈ యాంకర్.. టాలీవుడ్ లోనే టాప్ మేల్లీడ్‌ యాంకర్‌ల‌లో ఒకరిగా నిలిచాడు. ఒకప్పుడు మోస్ట్ ఎలిజిబుల్ యాంకర్ గా వరుస షోలలో సందడి చేస్తూ పాపులారిటీ సంపాదించుకున్న ప్రదీప్.. తను చేసిన ప్రతి షో తో సూపర్ హిట్ టాక్‌ తెచ్చుకున్నాడు. ఈ క్రమంలోనే స్టార్ ఇమేజ్‌ దక్కించుకున్నాడు.

యాంకర్ ప్రదీప్ పెళ్ళికొడుకు అవుతున్నాడు.. | TV anchor film star Pradeep  Machiraju marriage fixed news viral in tv media circles

ఇక ప్రదీప్ ఆటిట్యూడ్‌కు ఓ క్రేజీ ఫ్యాన్‌ ఫాలోయింగ్ ఉంది. ఇలాంటి క్రమంలో ప్రదీప్‌కు సంబంధించిన ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ నెటింట వైర‌ల్‌గా మారుతున్నాయి. తాజాగా ప్రదీప్ పెళ్లికి సంబంధించిన న్యూస్ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ప్రదీప్‌కు ఓ బడా పొలిటిషన్ కూతురితో పెళ్లి ఫిక్స్ అయిందట. అందులో నిజం ఎంతో తెలియదు కానీ.. ప్రస్తుతం ఈ న్యూస్ తెగ చక్కర్లు కొడుతుంది. యాంకర్ ప్రదీప్ పెళ్లి కోసం చాలామంది ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు. గతంలో ఎన్నోసార్లు ప్రదీప్ పెళ్ళిపై వార్తలు వచ్చినా.. తను రియాక్ట్ కాకపోవడంతో అదంతా ఫేక్ అని ఫ్యాన్స్ భావించేవారు. అయితే ఇప్పుడు మరోసారి ప్రదీప్ కు సంబంధించిన పెళ్లి వార్తలు వైరల్‌ అవుతున్నాయి.

Exclusive - Pradeep Machiraju refutes rumours of engagement with celebrity  stylist Navya Marouthu; here's what he has to say - Times of India

ఏపీకి చెందిన కూటమి ఎమ్మెల్యే కూతురుతో యాంకర్ ప్రదీప్ రహస్య ప్రేమాయణం నడుపుతున్నాడని ఇండస్ట్రీ, పొలిటికల్ వర్గాల స‌మాచారం. ఇక తను చదువు ప‌నిలో బిజీగా ఉంద‌ని ఈ క్రమంలోనే ఇన్ని రోజులు ప్రేమ వ్యవహారాన్ని దాచిపెట్టినట్లు సమాచారం. ఇక ఇప్పుడు వీరిద్దరి కుటుంబాలు.. వారి ప్రేమ విషయాన్ని అంగీకరించడంతో.. త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కడానికి సిద్ధమవుతున్నారట. ప్రదీప్ తండ్రి ఇటీవల అనారోగ్యంతో మరణించారు. పెళ్లి బాధ్యతలని తన తల్లి దగ్గర ఉండి చూసుకుంటుందని సమాచారం. ఈ వార్తలు నిజమైతే కనుక ఇది ప్ర‌దీప్‌ ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్ ఇస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు.