ఈ పై ఫోటోలో కనిపిస్తున్న హీరోయిన్‌ను గుర్తుపట్టారా. కొంతకాలం క్రితం వరకు ఈమె టాలీవుడ్ క్రేజీ బ్యూటీ. వరుస సినిమాల్లో నటిస్తూ ఎంతోమంది ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. కుర్రకారును కవించిన ఈ ముద్దుగుమ్మ.. సంజాబి అమ్మాయి అయినా.. తెలుగు సినిమాలతోనే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. శర్వానంద్, వరుణ్ తేజ్, సాయి ధరంతేజ్, విజయ్ దేవరకొండ, సందీప్ కిషన్, నాగశౌర్య ఇలా ఎంతో మంది యంగ్ హీరోలతో నటించిన ఈ ముద్దుగుమ్మ.. నాచురల్ స్టార్ నాని, విక్టరీ వెంకటేష్, మాస్ మహారాజ్ రవితేజ లాంటి స్టార్ హీరోలతోనూ నటించి ఆకట్టుకుంది. తన అందం, అభినయంతో టాలీవుడ్ ఆడియన్స్‌ను కట్టిపడేసింది. కెరీర్ పిక్స్‌లో ఉన్న సమయంలో ఈమె తీసుకున్న సంచలన నిర్ణయం కెరీర్ తలకిందులు చేసింది.
హర్యానాకు చెందిన ఓ రాజకీయ నాయకుడితో నిశ్చితార్థం చేసుకుని ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చింది. పెళ్లి ముహూర్తం ఫిక్స్ అయిన తర్వాత.. పెళ్లిని క్యాన్సిల్ చేసుకుంది. ఇక క్రేజీ హీరోయిన్గా అప్పటివరకు వరుస సినిమాల అవకాశాలు దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మకు.. మెల్లమెల్లగా అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. అలా ప్రస్తుతం ఈమె చేతిలో ఒక సినిమా కూడా లేకపోవడం ఆశ్చర్యం. ఇంతకీ ఈ ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టారా..? అయితే మేమే ఒక హిట్ ఇస్తాం.. తెలుగు ఆడియన్స్ ముద్దుగా హనీ అని పిలుస్తూ ఉంటారు. ఇప్పుడు అర్థమయిపోయి ఉంటుంది. ఎస్.. మీ గెస్ కరెక్టే. తన్నే మెహరీన్ పిర్జాద. నవంబర్ 5న ఆమె పుట్టిన రోజు కావడంతో.. ఆమెకు సంబంధించిన చిన్ననాటి ఫొటోస్, వీడియోస్ నెటింట తెగ వైరల్గా మారాయి. ఈ క్రమంలోనే అమ్మడి పదేళ్ళ వయసులోనే ర్యాంప్ వాక్ చేసిన పిక్ ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. 2013లో టొరెంటోలో జరిగిన మిస్ పర్సనాలిటీ సౌత్ ఏషియా కెనడా పోటీల్లో విజేతగా నిలిచిన మెహరీన్.. తర్వాత కొన్ని కమర్షియల్ యాడ్స్ లో ఆకట్టుకుంది.
ఇక నాని హీరోగా, హను రాఘవపూడి డైరెక్షన్లో రూపొందిన కృష్ణ గాడి వీర ప్రేమ కథతో హీరోయిన్గా పరిచయమైంది. ఎఫ్2లో హాని ఇస్ ద బెస్ట్.. అంటూ కుర్ర కారుకు హానీ బ్యూటీగా.. మారిపోయింది. ఇక ఈ అమ్మడి పర్సనల్ విషయానికి వస్తే 2021లో హర్యన్న టాప్ పొలిటిషన్ భవ్య భిష్ణోయ్ తో నిశ్చితార్థం జరుపుకుంది. కారణాలు తెలియవు కానీ.. కొంతకాలానికి వీరు పెళ్లి క్యాన్సిల్ అయింది. ఇక భవ్య భిష్ణోయ్ హర్యానాలో గతంలో మూడుసార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన భజన్ లాల్ భిష్ణోయ్ మనవడు కావడం విశేషం. ఇక అప్పటినుంచి మెహరీన్ సినిమాలు కూడా ఫ్లాప్ అవుతూ వచ్చాయి. గతేడాది రిలీజ్ అయినా స్కార్క్ అనే సినిమాల్లో చివరిగా మెరిసిన మెహరీన్.. తర్వాత తెలుగులో మరి సినిమాలు కనిపించలేదు. కేవలం కన్నడ సినిమాల్లో మాత్రమే నటిస్తోంది.