టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేష్‌కు ఫ్యామిలీ ఆడియోస్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికి టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోగా మంచి ఇమేజ్తో దూసుకుపోతున్న వెంకటేష్‌సి నీ కెరీర్‌లో సూపర్ డూపర్ హిట్ సినిమాల్లో మల్లేశ్వరి ఒకటి. ఇప్పటికీ ఈ సినిమా టెలివిజన్‌లో వస్తుందంటే చాలు.. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ప్రతి ఒక్కరు టీవికే అతుకుపోయి చూస్తూ ఉంటారు. ఈ సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. కే. విజయభాస్కర్ డైరెక్షన్లో వచ్చిన ఈసినిమాలో కత్రినా కైఫ్ హీరోయిన్గా నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా అప్పట్లో భారీ సక్సెస్ అందుకుంది.
సాంగ్స్ కూడా మ్యూజికల్ హిట్స్ గా నిలిచాయి. అయితే కత్రినా ఈ సినిమా తర్వాత మరోసారి తెలుగులో కనిపించలేదు. పూర్తిగా బాలీవుడ్‌కు పరిమితమైంది. ఇక ఈ సినిమాలో వెంకీ, కత్రినా కైఫ్ మధ్యన వచ్చే కామెడీ సీన్స్ అప్పట్లో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక సినిమాలో బ్రహ్మానందం, సునీల్, ఆహుతి ప్రసాద్ మధ్య కామెడీ సీన్స్ ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చేశాయి. ఇందులో కత్రిన కోట్లకు వారసురాలుగా నటించి మెప్పించింది. ఇక ఈ సినిమాలో ఆమె ప్యాలెస్ కు సంబంధించిన ప్రాపర్టీస్ అన్ని ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. అంటే.. రూమ్స్, డైనింగ్ టేబుల్ ఇలా ప్రతి ఒక్కటి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి. కాగా ఈ సినిమాలో డైనింగ్ టేబుల్ చూసిన వెంటనే వెంకటేష్ షాక్ అవుతాడు. అలా సినిమా చూసిన ఆడియన్స్ కూడా ఆ టేబుల్ చూసి ఆశ్చర్యపోయారు.
అయితే ఇటీవల మల్లేశ్వరి సినిమా డైనింగ్ టేబుల్ వెనుక స్టోరీని కె. విజయభాస్కర్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడుతూ ఈ సినిమా షూట్ చేసిన లలితా మహల్ లో అందరూ చూసిన డైనింగ్ టేబుల్ నిజానికి లేదు. ఈ సినిమాలో డైనింగ్ టేబుల్ కు సంబంధించిన సీన్స్ ఎక్కువగా ఉంటాయని.. ఉద్దేశంతోనే సినిమా కోసమే ఈ డైనింగ్ టేబుల్ను స్వయంగా ప్రొడ్యూసర్ సురేష్ దగ్గరుండి చేపించారంటూ వెల్లడించాడు. ఈ సినిమాలో కేవలం కొన్ని సన్నివేశాల కోసం ఆయన దగ్గరుండి ఎంత పెద్ద డైనింగ్ టేబుల్ చేయించారంటూ విజయ భాస్కర్ వెల్లడించారు. ప్రస్తుతం ఈ డైనింగ్ టేబుల్ స్టోరీ తెలుసుకున్న నెటిజన్స్ షాక్ అవుతున్నారు.