మహేష్ నయా లుక్ వైరల్.. జక్కన్న మూవీ లుక్ మార్చాడా..?

సూపర్ స్టార్ మహేష్ బాబు.. గుంటూరు కారం రిలీజ్ అయి చాలా కాలం అవుతున్న ఇప్పటివరకు ఆయన నుంచి మ‌రో సినిమా కూడా తెరకెక్కలేదు. ఈ క్రమంలోనే రాజమౌళి డైరెక్షన్‌లో మహేష్ బాబు నటించనున్న‌ సినిమా కోసం ఆడియన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పాన్ వరల్డ్ రేంజ్లో భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను రూపొందించనున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో మహేష్.. సరికొత్త లుక్‌లో కనిపిస్తాడు అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. అందుకు తగ్గట్టుగానే మహేష్ బాబు గ‌త‌ కొంతకాలంగా.. ఫుల్ గడ్డం, లాంగ్ హెయిర్‌తో రగడ లుక్‌లో మెరిసాడు.

ఈ క్రమంలోనే జక్కన్న, మహేష్ కాంబో మూవీలో మహేష్ లుక్ అదేనంటూ వార్తలు కూడా వైరల్ అయ్యాయి. అయితే ఇప్పటివరకు మహేష్ గతంలో ఏ సినిమాలోను ఇలా గడ్డం తో కనిపించలేదు. గుంటూరు కారంలో లైట్ బియర్డ్ లుక్‌లో కనిపించాడు. అయితే జక్కన్న సినిమా కోసం పూర్తిగా గడ్డానికి పెంచేసి.. బారు జుట్టుతో చాలా కాలంగా మహేష్ ఎక్కడ కనిపించిన ఇదే లుక్కులో ప్రత్యక్షమయ్యాడు. కాగా జక్కన.. మహేష్ లుక్ మరోసారి మార్చినట్లు తెలుస్తోంది. తాజాగా జక్కన్న కజిన్ కీరవాణి కుమారుడు ఫ్రీ వెడ్డింగ్ ఫంక్షన్ గ్రాండ్ లెవెల్లో జరిగింది. ఈ ఈవెంట్లో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా మెరిశారు. అయితే మహేష్ బాబు ఈ ఈవెంట్‌లో గడ్డం లేకుండా పూర్తిగా ట్రిమ్ చేసుకుని కనిపించారు.

అసలు గడ్డం లేకుండా స్మార్ట్ గా మహేష్ కనిపించడంతో మళ్ళీ ఇది నెటింట‌ హాట్ టాపిక్ గా మారింది. జక్కన్న మూవీలో మహేష్ గడ్డంతో కనిపించట్లేదేమో.. జక్కన్న, మహేష్ లుక్ ను మార్చాడేమో.. అన్నా సందేహాలు అభిమానుల్లో మొదలయ్యాయి. ఇక సినిమా వచ్చే ఏడాది సెట్స్‌ పైకి వెళ్ళనుందని టాక్. కనుక అప్పటివరకు మహేష్ లుక్ ఎలా మారుతుంది.. ఎన్ని వేరియేషన్స్ వస్తాయో.. ఎవరికీ తెలియదు. జక్కన్న ఎప్పటికప్పుడు తన ఆలోచన.. ఆడియన్స్ మైండ్‌కు చిక్కకుండా స్ట్రాటజీలు ఫాలో అవుతూనే ఉంటారు. అంతేకాదు ఆయనకు ఏదైనా సులువుగా నచ్చదు. ఎంతో ఆచితూచి క్యారెక్టర్ లను, అలాగే లుక్స్ లు కూడా కన్ఫామ్ చేస్తూ ఉంటాడు. అందుకే మహేష్ బాబుతో కొన్ని లుక్స్ మార్పించాలని చూస్తున్నట్లు టాక్‌ నడుస్తుంది. చివరకు మహేష్ బాబు ఎలాంటి లుక్ లో సినిమాలో మెరుస్తాడో వేచి చూడాలి.