పుష్ప 2 ట్రైల‌ర్ సంచ‌ల‌నం… ఓడియ‌మ్మా ఏంది ఈ రికార్డులు బ‌న్నీ…!

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్లు తెరకెక్కుతున్న పుష్ప సీక్వెల్ పుష్ప 2 ట్రైలర్ తాజాగా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. బీహార్ పాట్నాలో భారీ జనసందోహం మధ్యన గ్రాండ్ లెవెల్ లో ట్రైలర్ లాంచ్ నిర్వహించారు మేకర్స్. అయితే ఎప్పటినుంచో పుష్ప‌2 కు సంబంధించిన ట్రైలర్ కోసం అభిమానులంతా కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే పుష్ప 2 రిలీజ్ అయిన కొద్ది గంటలకే సంచలనం సృష్టించింది.

సినీ చరిత్రలోనే ఆల్ టైం రికార్డ్ ను పుష్పరాజ్ తన ఖాతాలో వేసుకున్నాడు. సినిమా రిలీజ్ అయిన కొన్ని గంటలకే 40+ మిలియన్ రియల్ టైం వ్యూస్‌, అలాగే 1.4 మిలియన్ లైక్స్ రావడం నిజంగా గ్రేట్ రికార్డ్ అనడంలో సందేహం లేదు. ఈ విషయాన్ని మేకర్స్ స్వయంగా ప్రకటించారు. ఇక ట్రైలర్ లో మాస్‌ ఎలిమెంట్స్ వేరే లెవెల్ లో ఉన్నాయ్ అనడంలో సందేహం లేదు. భార్య శ్రీ‌వ‌ల్లిగా ర‌ష్మిక మందన, ఐటమ్ క్లీన్ గా.. శ్రీలీల, పవర్ఫుల్ విలన్ గా ఫాహ‌ద్ తమ‌ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఖాయం అనేలా ట్రైలర్ కట్ తో ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాడు సుకుమార్.

ఇక ఈ మూవీ ట్రైలర్ కు వచ్చిన రెస్పాన్స్ చూస్తేనే సినిమాపై ఆడియన్స్ లో ఎలాంటి అంచనాలు ఉన్నాయో అర్థం అవుతుంది. ఈ క్రమంలోనే డిసెంబర్ 5న పుష్ప రాజ్ థియేటర్స్ లో సందడి చేయనన్నాడు. రిలీజ్ అయిన తర్వాత ఆడియన్స్‌ను ఏ రేంజ్ లో మూవీ ఆకట్టుకుంటుందో. పుష్ప 2 ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి.