తాజాగా నయనతార బయోగ్రఫీ డాక్యుమెంటరీ నెట్ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. నయనతార దీనికోసం సినిమా షూట్ టైంలో జరిగిన మూడు సెకండ్ల క్లిప్ తమ డాక్యుమెంటరీలో వాడుకున్నారు నయన్, విగ్నేష్. అయితే నిర్మాత ధనుష్‌కు ఇది నచ్చకపోవడంతో.. కాపీరైట్ కేస్ పై రూ10 కోట్లు ఇవ్వాలంటూ నోటీసులో జారీ చేశారు. దీనిపైన నయనతార రియాక్ట్ అవుతూ మూడు పేజీల బహిరంగ లేక తో ధనుష్‌ను విమర్శించింది.
అయితే గత ఆదివారం నయనతారకు సపోర్ట్‌గా.. తన భర్త విగ్నేష్ శివన్ వేదికగా రియాక్ట్ అవుతూ రెండు పోస్టులు షేర్ చేసుకున్నారు. అందులో ఒకటి కేవలం మూడు సెకండ్లకు ధనుష్ రూ.10 కోట్లు డిమాండ్ చేసిన వీడియో.. ఇదే మీరంతా ఫ్రీగా చూసేయండి అంటూ ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేసుకున్నారు. అంతటితో ఆగకుండా మరో పోస్ట్ లో 2017 లో సక్క పోడు పోడు రాజా సినిమా ఆడియో ఫంక్షన్ లో ధనుష్ మాట్లాడిన వీడియోను షేర్ చేశారు. ఇందులో ధనుష్ మాట్లాడుతూ ప్రేమను పంచడం గురించి నటినటులు పనిచేసే చోట్ల ఎలాంటి వాతావరణం ఉంటే బాగుంటుందో ధనుష్ వెల్లడించారు.
ఈ వీడియోని కౌంటర్గా విఘ్నేష్ జీవించండి.. ఇతరులను స్వేచ్ఛగా జీవించనివ్వండి.. అంటూ.. ప్రేమను పంచండి.. ఓం నమశివాయ.. మీరు చెప్పినది మీరు ముందు పాటించండి. కనీసం అభిమానుల కోసమైనా అంటూ నోట్ విడుదల చేశాడు. అయితే ఈ పోస్ట్ కొద్దిసేపటికే విగ్నేష్ శివన్ తొలగించడం అందరికి ఆశ్చర్యాని కల్పిస్తుంది. మరోవైపు సింగర్స్ సుచిత్ర.. ధనుష్ ఎంతోమంది హీరోయిన్లను వేధించాడంటూ విమర్శలు చేసింది.