ఈ పై ఫోటోలో కనిపిస్తున్న టాప్ స్టార్ బ్యూటీ ని గుర్తుపట్టారా.. ఈమె కు టాలీవుడ్ ప్రేక్షకులను ప్రత్యేక పరిచయం అవసరం లేదు. బాలీవుడ్ స్టార్ బ్యూటీగా క్రేజీ ఇమేజ్ తో దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మ.. తెలుగులో బాలయ్య, పవన్, మహేష్ లాంటి స్టార్ హీరోలో సరసన నటించిన బద్రీ, నరసింహుడు, నాని ఇలాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. అలా అమ్మడికి ఇక్కడ కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే ఈ అమ్మడు లేటు వయసులో.. తాజాగా ప్రేమ చిగురించిందంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. దానికి సంబంధించిన ఫొటోస్ కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. ఒకప్పుడు గ్లామర్ క్వీన్‌గా ఇమేజ్ ని క్రియేట్ చేసుకుని అమీషా.. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు భారీ పాపులారిటీని దక్కించుకుంది.
కెరీర్ మంచి పిక్ లో ఉన్న సమయంలో బాలీవుడ్ డైరెక్టర్ విక్రమ్ భట్‌తో ప్రేమలో పడి కొన్ని ఏళ్ల డేటింగ్ కూడా చేసింది. అయితే ఈ జంట మనస్పర్ధలు కారణంగా బ్రేకప్ చెప్పేసుకున్నారు. తర్వాత వీరిద్దరూ ఎదురుపడింది లేదు. అప్పటినుంచి ఇప్పటివరకు అమీషా ఎవరిని పెళ్లి చేసుకోలేదు. అయితే కొద్ది రోజుల్లో అమ్మడు అయిదుపదుల వయసుకు చేరుకుంటుంది. అయినా ఆ అమ్మాయి ఇప్పటికీ పెళ్లికి దూరంగానే ఉంటుంది. ఇలాంటి క్రమంలో అమ్మడికి సంబంధించిన పిక్స్ వైరల్ గా మారడంతో.. ఆమె పెళ్లి సమయం దగ్గర పడిందంటూ అభిమానులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. విక్రంతో బ్రేకప్ తర్వాత అమీషా మరో ఎన్నారై తో ప్రేమాయణం కొనసాగించింది. అది కూడా పెళ్లి పెళ్ళి వరకు వెళ్లక ముందే పెట్టకులైంది.
ఈ క్రమంలోనే చాలా కాలంగా ఒంటరిగా ఉంటున్న అమేషా తాజాగా 30 ఏళ్ల యువకుడితో దుబాయిలో విహరిస్తూ ఎంజాయ్ చేస్తుంది. ప్రస్తుతం దానికి సంబంధించిన ఫొటోస్ వైరల్ గా మారుతున్నాయి. దానికి ముఖ్య కారణం అతడి బిగి కౌగిలిలో అమిషా ఒదిగిపోతూ ఫోటోలకు ఫోజులు ఇవ్వడమే. ఇవి స్వయంగా తన ఇన్స్టా వేదికగా అమీషా షేర్ చేసుకుంది. నా డార్లింగ్ నిర్వాన్ బిర్లతో లవ్లీ సాయంత్రం అంటూ ట్యాగ్ జోడించింది. ఇక ఆ కుర్రాడు బిజినెస్ ఫ్యామిలీ కి సంబంధించిన వ్యక్తి. అయితే అమీషా పటేల్ కంటే ఇతను దాదాపు 20 ఏళ్లు చిన్నవాడు అంటే.. ఆమెషా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టే సమయానికి ఈ అబ్బాయి ఆరేళ్ల పిల్లోడు కావడంతో ప్రస్తుతం ఈ న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలోనే అమ్మడి అందానికి ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే అంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.