ప్రస్తుతం ఇండియాన్ సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన విషయం ధనుష్ వర్సెస్ నయనతార ఐష్యూ. నయన్ తన జీవిత ఆధారంగా ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ ఫిక్స్ లో తన డాక్యుమెంటరీని తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ” నయనతార బియాండ్ ది ఫెయిరీ టేల్స్ ” టైటిల్తో ఈ సిరీస్ తాజాగా తెరకెక్కింది. అయితే నయన్, విగ్నేష్ కలిసి పనిచేసిన మొదటి సినిమా నేను రౌడీ దానన్ లోని సీన్స్ చూపించాలని వీరిద్దరూ ఎంతగానో ప్రయత్నించినా.. మూవీ ప్రొడ్యూసర్ ధనుష్ దీనికి ఒప్పుకోకపోవడంతో నయనతార సోషల్ మీడియా వేదికగా మూడు పేజీల బహిరంగ లేఖలు అతనిపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఈ డాక్యుమెంటరీ రిలీజ్ అయింది. అయితే ఈ డాక్యుమెంటరీ ఆడియన్స్‌ను ఆకట్టుకుందా.. లేదా నానుం రౌడీ దానన్ సీన్స్ ఉన్నాయా.. తీసేసారా.. ఒకసారి తెలుసుకుందాం.
నయన్ లైఫ్ని ఓ అందమైన కథల చూపించడానికి నెట్‌ఫ్లిక్స్ ప్రయత్నించారు. ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా నయనతార, తన ఫ్యామిలీ.. చిన్నప్పటి ఫోటోలు, చదువు ఇతర విషయాలన్నీ ఎంతో ఆసక్తిగా మొదటి నుంచి చూపిస్తూ వచ్చారు. చిన్నప్పుడు అసలు సినిమాలు చూడని నయన్.. ఎప్పుడైనా బంధువులు వస్తే సినిమాలకు వెళ్లేదాన్ని ఇందులో తెలియజేసింది. జ్యూవెలరీ షాప్ యాడ్ చూసి.. సినిమా ఛాన్స్లర్ ఎలా వచ్చాయి.. మలయాళం నుంచి తమిళ్ సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఎలా ఉంది.. ఇలాంటి విషయాలను, అలాగే ఆదర్శకులతో సన్నివేశాలను చూపించారు. అంతేకాదు తన కెరీర్ స్టార్టింగ్ లో ఎదుర్కొన్న ఎన్నో ఇబ్బందుల గురించి ఈ సిరీస్ లో పంచుకున్నారు. ముఖ్యంగా గజినీ మూవీ టైం లో ఎన్నో విమర్శలు ఎదుర్కొంది. పత్రికలు, ఇండస్ట్రీలో వాళ్ళు తనని ఎలా బాడీ షేమింగ్ చేశారో చెబుతూ.. నయన్ బాధపడిన సందర్భాలను చూపించారు. అప్పుడు ధైర్యం చేసి బిల్లా కోసం బికినీ వేసుకొని నటించడం లాంటి సాహసాలు నయనతార చేసినట్లు వెల్లడించారు. ఇండస్ట్రీ జనాలు చేసిన విమర్శలే తాను రాటు తేలడానికి కారణమయ్యాయి అంటూ నయన్ చెప్పుకొచ్చింది.
ఇక సినీ ఇండస్ట్రీ అనేది రంగుల ప్రపంచం తెరపై చూసినట్లే నిజ జీవితంలోను బంధాలు, భావోద్వేగాలులు మార్పులు జరుగుతూ ఉంటాయి. కానీ.. అవి వాళ్ళ పర్సనల్ లైఫ్లను ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి.. ఎంత నిరాశకు గురవుతారు.. స్టార్స్.. వారి మధ్యన కొనసాగే బంధాలపై వచ్చే వార్తలు ఎంత మనోవేదనకు గురిచేస్తాయి అనే విషయాలను ఆమె వివరించిన తిరు ఆకట్టుకుంటుంది. తన ఎదుర్కొన్న పరిస్థితులను కూడా ఈ డాక్యుమెంటరీలో కళ్ళకు కట్టినట్లు చూపించారు. ఇక ఓ వ్యక్తితో బంధం కేవలం నమ్మకం పైన నిలబడుతుంది. వారి కోసం ఏమైనా చేస్తాం. వారు కూడా మనల్ని ప్రేమిస్తున్నారని నమ్ముతాం. ఇక సెలబ్రిటీ లైఫ్ అంటే జనం తమకు నచ్చినట్లు ఊహించుకుంటారు.. అంటూ సెలప్రెటీల అందరిలైఫ్‌కు సెట్ అయ్యేల చెప్పింది. ముఖ్యంగా జనాలు ఎప్పుడూ మగాళ్ళను అంటే హీరోలను ఏమీ అడగరు. హీరోయిన్లలో మాత్రమే ప్రశ్నిస్తారు. నటిమణులు మాత్రమే రిలేషన్ షిప్ లో ఉన్నట్లు చూపిస్తారు అంటూ ఘాటుగా రియాక్ట్ అయింది. వ్యక్తిగత జీవితంలో, సినిమాల విమర్శలతో అవకాశాలు కోల్పోయిన నయన్.. తిరిగి ఎలా ట్రాక్‌లోకి వచ్చిందో ఎమోషనల్ గా తెలియజేసింది.
అవకాశాలు తగ్గిన టైంలో నాగార్జున ఫోన్ చేసి బాస్ అవకాశం ఇచ్చారని.. రిలేషన్ షిప్ లో దెబ్బతిని బాధపడుతున్న టైం లో శ్రీరామరాజ్యంలో అవకాశం వచ్చిందని చెప్పుకొచ్చిన నయన్.. అందరూ ఈ సినిమా బృందం నిర్ణయాన్ని తప్పుపడుతూ వార్తలు రాసినప్పుడు.. ఆమె అనుభవించిన మానసికక్షోభను ఆ మూవీలో నటిమణులు, నిర్మాతలతో చెప్పించింది. మరీ ముఖ్యంగా సీత పాత్ర చేసినన్ని రోజులు ఆమె ఎంతో నిస్టగా ఉండేదని చెప్పుకొచ్చింది. ఇక అక్కడి నుంచి తన లేడీ సూపర్ స్టార్ ప్రయాణం మొదలైంది. తన పేరుతో తెరకెక్కిన సినిమాలు ఎన్ని కోట్లల్లో మార్కెటింగ్ చేశాయి. లాంటివి సినిమాలను ప్రస్తావిస్తూ చెప్పుకొచ్చింది. మొదటి ఫస్ట్ హాఫ్ నయన్ కెరీర్ ను ప్రస్తావిస్తే.. సెకండ్ హాఫ్ విగ్నేష్.. తన జర్నీ కాస్త స్పృశిస్తూ నేరుగా నానుమ్ రౌడీ దానన్ కోసం విగ్నేష్, నయన్‌తో కలిసి పనిచేసిన విషయాలను వెల్లడించారు. మొదటి రోజున సెట్ లో ఎలా ఉంది.. ఇద్దరి మధ్య ఎలాంటి సంభాషణలు జరిగాయి.. డైరెక్టర్గా కెరీర్ లో తొలి అడుగులు వేస్తున్న విగ్నేష్ కు నాయన ఎలాంటి ధైర్యాన్ని ఇచ్చారు. అదే సెట్ లో అతని చూసి ఆమె మనసు పారేసుకున్న తీరు.. ఇలా ప్రతి విషయాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించారు.
అంతే కాదు ధనుష్, నయన్ మధ్య చర్చకు కారణమైన ఈ సినీ సెట్లో జరిగిన ఇంట్రెస్టింగ్ సన్నివేశాలను కూడా కళ్ళకు కట్టారు. ఇక నయన్ బిజినెస్, ప్రేమ వ్యవహారం బయటకు తెలిసిన తర్వాత ఇటు ఇండస్ట్రీ జనాలు మీమర్స్ చేసిన వాటి గురించి విక్కీ మాట్లాడారు. నాగూర్ బిర్యాని.. ఉలందూర్‌పేటలోని కుక్కకు దొరకాలని రాసి ఉంటే ఎవరు ఆపలేరు అంటూ పెట్టిన మీమ్ బాగా ఫేమస్ అయినట్లు వెల్లడించారు. పెళ్ళికి ముందు నయన్, విగ్నేష్ రిలేషన్ ఎలా ఉండేది. ఇద్దరు షేర్ చేసుకున్నారు. ఎవరికీ ఎక్కువ కోపం వస్తుంది.. ఇద్దరికి కోపం వచ్చినప్పుడు పంచాయతీలు వచ్చినప్పుడు.. వీళ్లిద్దరికి సర్ది చెప్పిన డైరెక్టర్ ఎవరు.. ఇలా ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను రివిల్ చేశారు. తెరపై వాటిని ప్రజెంట్ చేసిన తీరు కూడా ఆకట్టుకుంటుంది. ఇక నయనతార పెళ్లి కోసం అయిదారువేల మంది పనిచేయడం, గ్లాస్ హౌస్లోనే తను ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంది.. పెళ్లి రోజున ఆమె ధరించిన ఎర్ర చీర స్పెషాలిటీ.. వాటిని తీర్చిదిద్దడానికి డిజైనర్లు పడిన కష్టం.. ఇలా ప్రతి ఒక్క విషయాన్ని క్లియర్గా చూపించారు. చివరిలో నయన్, విగ్నేషన్ పిల్లలు ఉలగం, ఉయిర్ లను చూపిస్తూ డాక్యుమెంటరీ ఎండ్ చేశారు. తెలుగులో దీని నయనానందకర ప్రయాణిం ఇది టైటిల్‌తో అందుబాటులో ఉంది.