టాలీవుడ్ చాక్లెట్ బాయ్.. యంగ్ అండ్ ఎనర్జీటిక్ స్టార్ హీరో.. రామ్ పోతినేనికి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇటీవల రామ్.. పూరి జగన్ డైరెక్షన్లో డబల్ ఇస్మార్ట్ తో ఆడియన్స్‌ను పలకరించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా పెద్ద డిజాస్టర్ గా నిల్చింది. పూరి ఇంకా పాత చింతకాయ పచ్చడి టైప్ లో సినిమాలు తీస్తున్నాడు అంటూ.. ఎన్నో విమర్శలు కూడా వినిపించాయి. పూరి ని నమ్మినందుకు రామ్‌కి భారీ పరాజయాన్ని అంటగట్టాడు. దీనితో రామ్ తన నెక్సట్ సినిమాను.. మిస్‌శెట్టి మిస్టర్ పోలిశెట్టి ఫేమ్ మహేష్ బాబుతో చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కనుంది. ఈ క్రమంలోనే రామ్‌కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ నెటింట వైరల్ గా మారుతుంది. ఇప్పటికే రామ్‌కు 36 సంవత్సరాల వయసు మీద పడిన సంగతి తెలిసిందే. తన వయసు హీరోలు ఇప్పటికీ పెళ్లిళ్లు చేసుకుని పిల్లలని కూడా కన్నారు. తను మాత్రం ఇప్పటివరకు పెళ్ళికి దూరంగానే ఉన్నాడు. అయితే తాజాగా రామ్‌కు ఒక పెళ్లి సంబంధం కుదిరిందని.. తన తల్లిదండ్రులతో పాటు పెదనాన్న స్రవంతి రవి కిషోర్ కలిసి సంబంధాన్ని చూసినట్లు సమాచారం. ఆ అమ్మాయి రామ్‌కు కొన్ని సంవత్సరాల నుంచి తెలుసట.
వారిద్దరూ మంచి ఫ్రెండ్స్ అని.. ఆ అమ్మాయిని రామ్ వివాహం చేసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కుటుంబ సభ్యులకు కూడా ఆమెకు రామ్‌ని ఇచ్చి పెళ్లి చేయాలని ఫిక్స్ అయ్యారట. వాస్తవానికి వీరి నిశ్చితార్థం సెప్టెంబర్ లో జరగాల్సింది. కానీ.. ఎందుకో వాయిదా పడింది. ప్రస్తుతం ఈ ఎంగేజ్మెంట్ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో లేదా మార్చిలో చేయాలని భావిస్తున్నారట. ఆ అమ్మాయి హైదరాబాదులో ప్రముఖ పారిశ్రామికవేత్త కూతురు అని టాక్. ఇక ఈ అమ్మడి పేరు పై హైదరాబాద్లో కొన్ని వందల కోట్ల విలువ చేస్తే ఆస్తులు కూడా ఉన్నాయని తెలుస్తుంది. త్వరలోనే నిశ్చితార్థంపై రామ్ టీం అఫీషియల్ ప్రకటన ఇవ్వనున్నారు.