ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కనున్న తాజా మూవీ పుష్ప 2. డిసెంబర్ 5న పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ట్రైలర్ లాంచ్ అయినట్లు మేకర్స్ ఇటీవల అనౌన్స్ చేశారు. ఇక ఆ క్షణం నుంచి ఆడియన్స్ అంతా ఎప్ఫుడెప్పుడా అంటూ ఎదురు చూసిన పుష్ప 2 ట్రైలర్.. బీహార్లో పాట్న వేదిక గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అయింది. ఊర మాస అవతారంలో బన్నీ దర్శనం ఇచ్చారు. ముఖ్యంగా జాతర సీన్స్ ఫాన్స్ కు పూనకాలు తెప్పించడం ఖాయం అన్నట్లు అనిపిస్తోంది.
రష్మిక మందన హీరోయిన్గా ఆకట్టుకుంది. శ్రీవల్లి గెటప్.. పుష్పను భార్యగాఆ ఎలివేట్ చేసిన డైలాగ్స్, శ్రీ లీల ఐటమ్ పాంగ్ ఆడియన్స్‌కు పూనకాలు తెప్పించడం కాయం అన్నేట్లుగా మరోసారి తనదైన స్టైల్ లో ఆకట్టుకున్నారు. ఇక ట్రైలర్ ఆధ్యాంతం ప్రేక్షకులను మెప్పించింది. సునీల్, అనసూయ, జగపతి బాబు లుక్స్ కూడా ఆకట్టుకున్నాయి. విలన్ గా పాహద్ ఫజిల్ పూర్తి విశ్వరూపం.. పుష్ప 2లో బన్నికి గట్టిపోటి ఇస్తూ హైలెట్ అయ్యేలా కనిపిస్తుంది.
చివరిలో బన్ని పుష్పా అంటే నేషనల్ అనుకుంటివా.. ఇంటర్నేషనల్ అంటూ చెప్పిన డైలాగ్ ఫ్యాన్స్‌కు ఫుల్ ఊపు తెప్పిస్తుంది. సినిమా పై మరింత ఆసక్తిని పెంచుతుంది. ఇక ఈ సినిమా మ్యూజిక్ కూడా ఆడియన్స్‌కు గూస్ బంప్స్ తెప్పిస్తుంది. రిలీజ్ అయిన తర్వాత పుష్ప రాజ్ ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తాడో మూవీ ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో వేచి చూడాలి.