నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం టాలీవుడ్ టాప్ సీనియర్ స్టార్ హీరోగా తిరుగులేని ఇమేజ్తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. వరుస హ్యాట్రిక్ లతో మంచి ఫామ్ లో ఉన్న బాలయ్య.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్నాడు. తాజాగా తన 109వ సినిమాతో ఆడియన్స్‌ను పలకరించడానికి సిద్ధమవుతున్నాడు. డాకు మహారాజ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమా వచ్చేయడాది సంక్రాంతి బరిలో జనవరి 12 గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమా తర్వాత బాలయ్య అఖండ 2 తాండవం సెట్స్‌లో సందడి చేయనున్నాడు. బాలయ్య – బోయపాటి పెయిర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఇప్పటికే వీరి కాంబోలో తెరకెక్కిన సినిమాలు బ్లాక్ బస్టర్‌లుగా నిలిచాయి. ఈ క్రమంలోనే నాలుగోసారి ఈ కాంబో రిపీట్ కానుంది. అఖండ లాంటి బ్లాక్ బస్టర్ సీక్వెల్ గా రూపొందుతున్న సినిమా కావడంతో.. ఈ సినిమా సెట్స్‌పైకి రాకముందే ఆడియన్స్ లో విపరీతమైన అంచనాల నెలకొన్నాయి. ఇక సినిమాలే కాకుండా.. మరో పక్కన అన్ స్టాపబుల్ షోతో హోస్ట్ అవతారం ఎత్తి తిరుగులేని ఇమేజ్ క్రియేట్ చేసుకున్న బాలయ్య.. ఇప్పటికే మూడు సీజన్లను సక్సెస్ఫుల్గా పూర్తి చేశారు. తాజాగా అన్ స్టాపబుల్ సీజన్ 4ని కూడా ప్రారంభించిన సంగతి తెలిసిందే. గత మూడు సీజన్‌లలో కంటే.. ఈ సీజన్ ఆడియన్స్ లో మరింత ఆసక్తిని నెలకొల్పుతుంది.
అయితే అయితే గతంలో బాలయ్య ఓ ఈవెంట్‌లో మాట్లాడుతూ తన మనవళ్ల గురించి చేసిన కామెంట్స్ నెటింట వైరల్ గా మారుతున్నాయి. ఓ ఈవెంట్‌లో స్టేజ్ పైకి యాంకర్ వచ్చి బాలయ్యను మామయ్య అని పిలవచ్చా అంటూ అడిగగా.. బాలయ్య తనదైన స్టైల్ లో రియాక్ట్ అవుతూ నా మనవళ్లే నన్ను తాతయ్య అని పిలవరు.. నువ్వు మావయ్య అని పిలుస్తావా అంటూ కామెంట్స్ చేశాడు. అప్పుడు యాంకర్ మీ మనవళ్ళు ఏమని పిలుస్తారు అని ప్రశ్నించగా.. బాల అని ముద్దు ముద్దుగా పిలుస్తారు అంటూ వివరించారు. బాలకృష్ణ చెప్పిన ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ టాపిక్‌గా వైరల్ అవుతుంది.