అక్కినేని యువ సామ్రాట్ నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల జంట వివాహానికి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వీరికి సంబంధించిన ఏ అప్డేట్ అయినా నెటింట క్షణాల్లో వైరల్ గా మారుతుంది. ఇటీవల శోభిత తన పుట్టింట్లో పెళ్లి పనులు ప్రారంభించిన ఫోటోలు, వీడియోలు కూడా సోషల్ మీడియాలో శోభిత షేర్ చేసుకున్న క్షణాల్లోనే వైరల్గా మారిన సంగతి తెలిసిందే. వీరిద్దరి పెళ్లి ఇప్పుడు టాలీవుడ్ లో తెగ వైరల్ గా మారుతుంది. పెళ్లి ఎప్పుడు జరుగుతుందో అఫీషియల్ ప్రకటన రాకున్నా.. డిసెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియోస్ లో పలువురు బంధుమిత్రుల సమక్షంలో గ్రాండ్గా జరుపుకోబోతుందని వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. చాలాకాలం తర్వాత మన తెలుగు రాష్ట్రాల్లో పెళ్లి చేసుకుంటున్నా సెలబ్రిటీ కపుల్ గా చైతన్య, శోభిత నిలవనన్నారు.
ఇక చాలాకాలంగా డెస్టినేషన్ వెడింగ్ పేరుతో ఇతర రాష్ట్రాల్లో, అలాగే ఇతర దేశాల్లో సెలబ్రిటీస్ పెళ్లిళ్లు చేసుకుంటున్న విషయం తెలిసిందే. మీడియాకి కూడా అనుమతి లేకుండా వాళ్లంతా వివాహాలు చేసుకుంటున్నారు. దీంతో కాస్త అభిమానుల నుంచి నిరాశ ఎదురవుతుంది. అయితే వీళ్ళ పెళ్లి మాత్రం అలా కాకుండా ఒకప్పుడు స్టార్ హీరోస్ చరణ్, ఎన్టీఆర్, బన్నీ పెళ్లిళ్లు జరిగిన విధంగా జరగనుందని సమాచారం. ఇదిలా ఉంటే వీళ్లిద్దరు పెళ్ళి వెడ్డింగ్ కార్డు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ శుభలేఖ కాస్ట్ వింటే మైండ్ బ్లాక్ అయిపోవాల్సిందే. ఒక్కో శుభలేఖకు అక్షరాల పదివేల రూపాయలు అయిందని సమాచారం. దీన్ని బట్టి ప్రింట్ చేయించిన అన్ని శుభలేఖలు విలువ ఎంత ఉంటుందో అసలు ఊహించలేరు.
ఈ క్రమంలోనే అక్కినేని వారసుడు పెళ్లి అంటే ఈ మాత్రం ఉంటుందంటూ కామెంట్లు ఎత్తమవుతున్నాయి. ఇక ఇప్పటికీ పెళ్లికి సంబంధించి అన్నపూర్ణ స్టూడియోస్ లో భారీ సెట్స్ ఏర్పాటు చేశారని.. ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ తోటాతరణి ఈ సెట్ బాధ్యతలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సెట్ విలువ దాదాపు రూ.10 కోట్లు ఉంటుందట. ఇక నాగచైతన్య, శోభిత పెళ్లి తెలుగు ప్రేక్షకులు జీవితాంతం గుర్తుంచుకునే రేంజ్ లో ఏర్పాట్లు చేస్తున్నారని తెలుస్తుంది. ఇక చైతన్య సినిమా విషయాలకు వస్తే తండెల్ మూవీ షూటింగ్లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. అల్లు అరవింద్ ప్రొడ్యూసర్గా గీతా అర్ట్స్ పై దాదాపు రూ.70 కోట్ల భారీ బడ్జెట్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ మూవీ గా రుపొందుతున్న ఈ సినిమాకు చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నాడు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న సినిమా గ్రాండ్ లెవెల్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. సాయి పల్లవి హీరోయిన్గా, దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్ గా రానున్న ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో వేచి చూడాలి.