కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఇటీవల నటించిన మూవీ కంగువా. ఇక సూర్య.. ఈ సినిమా సక్సెస్ కోసం బాహుబలి రేంజ్ లో ప్రచారాలు చేస్తూ.. సినిమాపై విపరీతమైన హైప్ క్రియేట్ చేశారు. రిలీజ్‌కి ముందు వరకు ప్రేక్షకుల్లో భార్య అంచనాలను నెలకొల్పిన ఈ సినిమా తాజాగా రిలీజ్ అయింది. అయితే మొదటి షో తోనే సినిమాకు నెగిటివ్ రివ్యూస్ మొదలయ్యాయి. మూవీలో ప్లస్ల కంటే మైనస్ లో ఎక్కువగా ఉన్నాయంటూ వార్తలు తెగ వైరల్ అయ్యాయి. ఇప్పుడు ఇదంతా చెప్పడానికి కారణం సూర్య భార్య జ్యోతిక రియాక్షన్. కంగువ పై కుట్ర జరుగుతుందంటూ ఆమె షాకింగ్ కామెంట్స్ చేశారు. కావాలనే మన మూవీని తొక్కేస్తున్నారని వెల్లడించింది. నటుడు సూర్య భార్యగా కాదు.. జ్యోతికాగా, సినీ ప్రేక్షకురాలుగా ఈ నోట్ రాస్తున్న.
కంగువా అద్భుతం. సూర్యని చూస్తుంటే నిజంగా గర్వంగా అనిపించింది. ఇలాంటి సాహసం చేయాలంటే ఎంతో ధైర్యం ఉండాలి. మొదటి అరగంట సినిమా బాగోలేదు, మ్యూజిక్ కూడా లౌడ్ గా అనిపించింది అన్నది వాస్తవం. మన సినిమాల్లో తప్పులు సహజంగానే జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా ఇలాంటి సినిమాల్లో చిన్న చిన్న పొరపాట్లు అవుతాయి. మళ్ళీ చెబుతున్న మూడు గంటల సినిమాలో తొలి అరగంట మాత్రమే బాగోలేదు. మీడియా, పలువురు సినీ ప్రముఖుల నుంచి నెగిటివ్ రివ్యూస్ రావడంతో నేను షాక్ అయ్యా. వీళ్ళెవరు రిపీటెడ్ స్టోరీస్ తో వచ్చిన సినిమాలకు, అమ్మాయిలు వెంటపడి.. డబల్ మీనింగ్స్ వాడే సినిమాలకు, ఓవర్ యాక్షన్ సీక్వెన్స్లకు నెగిటివ్ రివ్యూలు ఇచ్చిందే లేదు. అలాంటిది ఎన్నో పాజిటివ్ అంశాలు ఉన్నాకంగువాకు.. అసలు పాజిటివ్ లేవన్నట్టు పూర్తిగా నెగటివ్ రివ్యూస్ ఇచ్చారు.
సెకండ్ హాఫ్ లో అమ్మాయిల ఫైట్ సీక్వెన్స్, పిల్లాడి ట్రాక్ రివ్యూ రాసేటప్పుడు ఇవేవీ రివ్యూ వాళ్లకు కనిపించలేదనుకుంటా. మొదటి రోజు కంగువ పై నెగెటివ్ చూస్తే నాకు చాలా బాధగా అనిపించిందంటూ జ్యోతిక వెల్లడించింది. ఫస్ట్ షో అవ్వకముందే ఇలా రివ్యూలు ఇచ్చేశారు. ఇదంతా చూస్తే సినిమాని కావాలని తొక్కేస్తున్నారని అర్థమవుతుంది. సినిమా కాన్సెప్ట్ ఏంటి.. దాని వెనుక కష్టాన్ని కూడా కనీసం నటినటులకు ప్రశంసలు దక్కకుండా చేస్తున్నారని నాకు అర్థం అవుతుంది. నెగిటివ్గా మాట్లాడే వాళ్లకు అలా చేయడం మాత్రమే వస్తుందని జ్యోతిక తన ఇన్స్టా వేదికగా సుదీర్ఘమైన పోస్ట్ను షేర్ చేసుకుంది.