ప్రస్తుతం మన లైఫ్ స్టైల్ లో లక్షలాదిమంది డయాబెటిస్ సమస్యలతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. నూటికి సగం మందికి పైగా డయాబెటిస్ ఇబ్బందితో సతమతమవుతున్నారు. అలా మన సినీ ఇండస్ట్రీలో కూడా ఎంతో మంది సెలబ్రిటీస్ డయాబెటిస్ తో ఇబ్బందులు పడుతున్నారు. టాలీవుడ్ స్టార్ బ్యూటీస్ సమంతకు డయాబెటిస్ ఉందన్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది. అంతేకాదు తగిన వ్యాయామం, ఆహారపు అలవాట్లు, సరైన లైఫ్ స్టైల్ తో ఆ డయాబెటిస్ ను బ్యాలెన్స్ చేస్తున్నట్లు సమంత స్వయంగా వెల్లడించింది.
ఇక బాలీవుడ్ హీరోయిన్స్ ఒనం కపూర్‌కు తన 17 ఏళ్ల వయసులోనే టైప్ వన్ డయాబెటిస్ వచ్చిందట. ఈమె కూడా నిబద్ధతతో కూడిన జీవనశైలిని అనుసరించే దాన్ని కంట్రోల్లో ఉంచుకుంటున్నాను అంటూ వెల్లడించింది. ఇక సౌత్ స్టార్ హీరో.. యూనివర్సల్ కథానాయకుడు కమల్ హాసన్ కు కూడా మధుమేహం ఉంది. షుగర్ వ్యాధిని తన వ్యాయామం ద్వారా, యోగా ద్వారా నియంత్రిస్తూ.. ప్రతిరోజు యాక్టివ్ గా, ఎనర్జిటిక్ గా ఉండేందుకు మంచి లైఫ్ స్టైల్ అలవర్చుకున్నారు.
బాలీవుడ్ స్టార్ బ్యూటీ ప్రియాంక చోప్రా, భర్త నిక్ జోనస్లకు కూడా ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అయితే వీరిద్దరూ కూడా మధుమేహం భారిన పడ్డారట. నిక్ జోనస్ టైప్ వన్ డయాబెటిస్ తో బాధపడుతున్నానని.. ఓ సందర్భంగా వెల్లడించారు. క్రమం తప్పకుండా ఎక్సర్‌సైజ్, సరైన ఆహారపు అలవాట్లతో ఆ డయాబెటిస్ను నియంత్రిస్తున్నట్లు నిక్ చెప్పుకొచ్చారు. ఇలా ఇప్పటికే సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ హీరో, హీరోయిన్లు డయాబెటిస్ ను తమ లైఫ్ స్టైల్.. యోగ, వ్యాయామాలు, ఆహారపు అలవాట్లతో బ్యాలెన్స్ చేస్తున్నారు.