సినీ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రెటీలుగా ఇమేజ్ క్రియేట్ చేసుకున్న తర్వాత వారికి సంబంధించి ఏదైనా చిన్న న్యూస్ బయటకు వచ్చిన నెటింట హట్ టాపిక్గా వైరల్ అవుతూనే ఉంటుంది. ఈ క్రమంలోనే ఎంతోమంది స్టార్ హీరో, హీరోయిన్లు ఎఫైర్ల వార్తలు, లవ్ బ్రేకప్ వార్తలు కూడా వైరల్ అవుతూనే ఉంటాయి. అయితే సౌత్ లో కంటే బాలీవుడ్ లో ఈ ఎఫైర్, రొమాన్స్, బ్రేకప్ రూమర్లు ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి. అలా ప్రస్తుతం ఉన్న స్టార్ హీరో, హీరోయిన్లు అంతా ఒకరితో రిలేషన్ మెయింటైన్ చేశారంటూ వార్తలు వచ్చి.. మరొకరితో వివాహం చేసుకున్న వాళ్లే. అయితే నార్త్ సెలబ్రిటీలకు సమానంగా ఆ రోజుల్లోనే ఓ సౌత్ హీరో ఎంతోమంది హీరోయిన్లతో ఎఫైర్ నడిపి వార్తల్లో నిలిచాడు. అతనెవరో కాదు లోకనాయకుడు కమలహాసన్.
కమలహాసన్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన కెరీర్ లోనే ఎన్నో వైవిధ్య పాత్రలో నటించి హీరోగా, విలన్ గా కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించాడు. ఈ జనరేషన్ లో కమల్ హాసన్ అంత డేరింగ్ గా విభిన్న పాత్రలో నటించే హీరోలు లేరనడంలో అతిశయోక్తి లేదు. ఇదే సమయంలో ఎంతో మంది హీరోయిన్లతో ఎఫైర్‌లు నడిపిన కమలహాసన్.. పెళ్లికి ముందే పిల్లలను కానీ ఆ తర్వాత వివాహం చేసుకున్న ఘనతను కూడా క్రియేట్ చేశాడు. రెండో భార్య సారికతో రిలేషన్ మెయింటైన్ చేసిన కమలహాసన్.. పెళ్లికి ముందే ఆమెతో ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చాడు. శృతి హాసన్, అక్షరా హాసన్ ఇద్దరూ సారీకతో రిలేషన్ లో ఉన్న సమయంలోనే జన్మించారు. తర్వాత ఈ జంట పెళ్లి చేసుకున్నారు. అయితే సారికకు విడాకులు ఇచ్చిన తర్వాత కమలహాసన్.. నటి గౌతమీతో లివింగ్ రిలేషన్ షిప్ లో ఉన్నారు.
ఇప్పుడు వీరిద్దరు కూడా విడిపోయారు. అయితే ప్రస్తుతం కమల్ హాసన్ కూతురుగా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన శృతిహాసన్ అతి తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్ ఇమేజ్ను క్రియేట్ చేసుకుని తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఎన్నో సినిమాల్లో నటించి పాపులారిటి దక్కించుకుంది. సింగర్ గాను ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ఇక హీరోయిన్గా కొనసాగుతుందనుకున్న శృతిహాసన్ కెరీర్ గాడి తప్పింది. వ్యక్తిగత సమస్యలతో కెరీర్‌ను పాడు చేసుకున్న ఈ అమ్మడు.. వరుస సినిమాలతో బిజీగా ఉన్న టైంలో మైకేల్ కోసలే అనే వ్యక్తిని ప్రేమించి లివింగ్ రిలేషన్ షిప్ లో ఉంది.
కొన్నాళ్లు బాగానే సాగిన వీరి బాగోతం.. 2019లో తడబడింది. ఈ విభేదాలతో ఇద్దరు బ్రేకప్ చెప్పుకున్నారు. తర్వాత ముంబై కి చెందిన డ్యూడల్ ఆర్టిస్ట్ శాంతను హాజరికతో ప్రేమలో పడిన శృతి రెండేళ్లు అతనితో డేటింగ్ తర్వాత అతనికి కూడా గుడ్ బై చెప్పేసింది. అంతే కాదు గతంలో ఈ అమ్మడు ఇండస్ట్రీకి చెందిన పలువురు హీరోలతో ఎఫైర్‌లు నడిపించినట్లు కూడా వార్తలు వైరల్ అయ్యాయి. దీంతో తండ్రికి తగ్గ కూతురుగా శృతిహాసన్ నడుచుకుంటుంది అంటూ కామెంట్లు ఎన్నో వెల్లువవుతున్నాయి.