టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మెగా హీరోలుగా ఎంతో మంది అడుగుపెట్టి రాణిస్తున్న సంగతి తెలిసిందే. వారిలోనే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా ఒకరు. ముకుంద సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన వరుణ్.. ఫిదా సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. కంచే, తొలిప్రేమ, ఎఫ్ 2, ఎఫ్ 3, గద్దెలకొండ గణేష్, అంతరిక్షం.. ఇలా వరుస సక్సెస్‌లను అందుకొని మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు. అయితే మెగా ట్యాగ్ వాడుకోకుండా వరుస హిట్లను తన ఖాతాలో వేసుకున్న వరుణ్ తేజ్.. స్టార్ హీరో ఇమేజ్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇలాంటి క్రమంలో గాంఢీవధారి అర్జున్, గని సినిమాలతో వరుస ఫ్లాప్‌లు ఎదురయ్యాయి.
దీంతో కొంతకాలం గ్యాప్ తర్వాత మట్కా సినిమాతో మరోసారి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయాలని సిద్ధమయ్యాడు వరుణ్ తేజ్. ఈ సినిమా కరణ్ కుమార్ డైరెక్షన్లో తెరకెక్కింది. వరుణ్ హీరోగా, మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటించిన ఈ మట్కా టీజర్, ట్రైలర్లు ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా డైలాగ్స్ ప్రేక్షకులను మెప్పించాయి. ఈ క్రమంలోనే నవంబర్ 14న సినిమా రిలీజ్ అయింది. అయితే భారి అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డీలపడింది. నెగటివ్ టాక్ రావడంతో విపరీతమైన ప్రభావం పడింది. ఈ క్రమంలోనే కలెక్షన్లు కూడా భారీగా పడిపోయాయి. ఇప్పటికి ఆ నెగటివ్ టాక్ కొనసాగుతూ ఉండడంతో కలెక్షన్స్ అంతంత మాత్రమే ఉంటున్నాయి.
ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో భారీ హైప్ క్రియేట్ చేసిన మట్కా.. ఫస్ట్ డే తోనే కలెక్షన్లతో అభిమానులకు షాక్ ఇచ్చింది. అలా ఫస్ట్ డే కలెక్షన్స్ చూస్తే వైజాగ్ లో రూ.0.18 కోట్లు, సీడెడ్ లో రూ.0.06 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ.0.09 కోట్లు, ఈస్ట్ రూ.0.5 కోట్లు, వెస్ట్ రూ.0.3 కోట్లు, గుంటూరు రూ.0. 03 కోట్లు, కృష్ణ రూ.0.06 కోట్లు, నెల్లూరు రూ.0.02 కోట్లు, అలా..ఏపీ, తెలంగాణ మొత్తంగా రూ.0.56 కోట్లు కలెక్షన్లను మాత్రమే సాధించగలిగింది. ఇక మిగతా ఇండియాలేను, ఓవర్సీస్ లో మొత్తంగా రూ.0.12 కోట్లు కలెక్షన్లు వచ్చాయి. అలా ప్రపంచవ్యాప్తంగా మట్కా కేవలం రూ.0.64 కోట్ల కలెక్షన్ మాత్రమే సాధించగలిగింది. కాగా ఈ ఏడాదిలోనే టాలీవుడ్ నుంచి భారీ బడ్జెట్‌తో తెరకెక్కి అతిపెద్ద డిజాస్టర్‌గా సినిమా నిలిచిపోయింది. ఈ విషయాన్ని సినీ పండితులు తేల్చి చెబుతున్నారు.