సూపర స్టార్ మహేష్ మొబైల్ వాల్ పేపర్ ఏంటో తెలుసు .. బాబు మహాముదురు..!

సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడి గా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు తర్వాత తండ్రి ని మించిన నటుడు గా గుర్తింపు తెచ్చుకుని టాలీవుడ్ లోనే స్టార్ హీరో గా దూసుకుపోతున్నాడు . ప్రస్తుతం మహేష్ తన 29 వ సినిమా ను దర్శక ధీరుడు రాజమౌళి తో చేయబోతున్నాడు . ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన లుక్ మేకవర్లో మహేష్ బిజీగా ఉన్నాడు . అలాగే రాజమౌళి కూడా సినిమా షూటింగ్ కోసం లొకేషన్ ల‌ వేటలో ఉన్నాడు . అలాగే రచయిత విజయేంద్రప్రసాద్ ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కథను పూర్తి చేశాడు . వచ్చే సంక్రాంతి తర్వాత ఈ సినిమా షూటింగ్ మొదలు కాబోతుందని కూడా అంటున్నారు .


ఈ సినిమా తో మహేష్ బాబును రాజమౌళి పాన్ వరల్డ్ హీరో గా మార్చబోతున్నాడు . అయితే ఇప్పుడు మహేష్ బాబుకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . మహేష్ సినిమాల విషయం పక్కన పడితే .. సూపర్ స్టార్ తన‌ ఫోన్ లో పెట్టుకున్న వాల్ పేపర్ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . సాధారణంగా సూపర్ స్టార్ తన గారాల ప‌ట్టి సితార లేక కుమారుడు గౌతమ్ లేక భార్య న‌మ్ర‌త‌ తో క‌లిన ఉన్న ఫోటోను వాల్ పేపర్ గా పెట్టుకుంటారని అందరూ అనుకుంటారు .

100+] Mahesh Babu Hd Wallpapers | Wallpapers.com
కానీ మహేష్ బాబు మాత్రం ఎవరూ ఊహించని విధంగా ఓ భిన్నమైన వాల్ పేపర్ పెట్టుకుని అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు . మహేష్ బాబు తన ఫోన్ వాల్ పేపర్ గా ఎర్త్ ఫోటో పెట్టుకున్నాడు . అందులో ఇండియా మ్యాప్ ప్రత్యేకంగా కనిపించే విధంగా ఉంటుంది . ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మహేష్ అభిమానులు నెటిజన్లో.. సూపర్ స్టార్ పై ప్రశంసల వర్షం కురిపిస్తూ ఆ ఫోటోను వైరల్ చేస్తున్నారు .