సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా అడుగుపెట్టి కెరీర్‌లో ముందుకు వెళ్లాలంటే ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. కేవలం అందం కాదు కచ్చితంగా అదృష్టం కూడా ఉంటేనే అవకాశాలు దక్కించుకుని రాణించగలుగుతారు. అలా అదృష్టం కలిసి రాక ఇండస్ట్రీకి దూరమైన హీరోయిన్లు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వారిలో బాలయ్య బ్యూటీ హనీరోజ్ కూడా ఒకటి. చూడడానికి ఎంతో అందంగా, ముద్దొచ్చే హనీ రోజ్.. టాలెంట్ కూడా ఉన్న సినిమాల్లో రాణించలేకపోతోంది. 2005లో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ఇప్పటివరకు సరైన సక్సెస్ అందుకోలేదు. బాయ్ ఫ్రెండ్ అనే మలయాళ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమై హనీ.. తన మొదటి సినిమాతోనే అక్కడ ప్రేక్షకులను ఆకట్టుకుంది.
కుర్రాళ డ్రీమ్ గర్ల్ గా మారిపోయింది. తర్వాత మళయాళ, తమిళ్‌లో సినిమాల్లో నటించింది. తెలుగు ఇండస్ట్రీలోనూ ఆలయం సినిమాతోను మెరిసింది. కానీ అమ్మడుకి ఈ సినిమాలేవి పెద్దగా సక్సెస్ ఇవ్వలేదు. ఎన్నో సినిమాల్లో కీలక పాత్రలో కనిపించిన హనీ.. తర్వాత నందమూరి బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమాల్లో.. బాలయ్య మరదలు పాత్రలు కనిపించి ముప్పించింది. దీంతో అమ్మడుకి ఒక్కసారిగా విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఈ సినిమా తర్వాత వరుస అవకాశాలు క్యూ కట్టాయి. సినిమాలోనే కాదు.. పలు షాపింగ్ మాల్ ఓపెనింగ్స్, యాడ్స్ లో కూడా ఫుల్ బిజీగా మారిపోయిన ఈ ముద్దుగుమ్మ.. సోషల్ మీడియాలోనూ మంచి ఫ్యాన్ క్రేజ్ ను సంపాదించుకుంది.
ఈ క్రమంలోనే ఇప్పటికి తన సోషల్ మీడియా వేదికగా నిత్యం ఏవో ఒక గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ ఫ్యాన్స్‌ను ఫిదా చేస్తుంది. ఇదిలా ఉంటే ఇప్పటివరకు యాక్టర్ గా కనిపించిన హనీ రోజ్.. త్వరలోనే నిర్మాతగా మారాలని ఫిక్స్ అయిందట. వర్గీస్ ఇస్ ప్రొడక్షన్ పేరుతో నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసిన ఈ ముద్దుగుమ్మ.. తాజాగా సోషల్ మీడియా వేదికగా దానిని వెల్లడించింది. ఇక ఈ అమ్మడి పర్సనల్ విషయానికి వస్తే.. ఆమెకు తెలుగు హీరో అంటే ఎంతో ఇష్టమట. ఇప్పటికీ ఆమె ఆయనకు ఫోన్ చేసి మాట్లాడుతూనే ఉంటుందట. అర్ధరాత్రి టైంలో ఫోన్ చేసి తెగ విసిగించేస్తుందట. నువ్వంటే నాకు చాలా ఇష్టం అంటూ పదేపదే చెప్తున్నా.. ఆ హీరో మాత్రం పట్టించుకోలేదని.. దీంతో అమ్మే కాస్త హర్ట్ అయినట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ఈ వార్తలో నిజం ఎంతో తెలియదు కానీ.. ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్‌గా మారుతుంది.