టాలీవుడ్ ఇండస్ట్రీలో గతంలో ఎన్నో అద్భుతమైన సూపర్ హిట్స్ అందుకొని.. క్రేజీ డైరెక్టర్లుగా దూసుకుపోయిన దర్శకుల్లో చాలామంది ఇప్పుడు ఇండస్ట్రీలో కెరీర్‌ను కొనసాగించాలంటే ఎంతో ఇబ్బంది పడుతున్నారు. వరుస అపజవయాలను ఎదుర్కొంటూ పెడౌట్ దశకు వెళ్ళిపోతున్నారు. అలా టాలీవుడ్ దర్శకల్లో అర్జెంట్గా హిట్ పడకపోతే దుకాణం మూసేయాల్సిందే అనే దర్శకుల లిస్ట్ ఏంటో ఒకసారి చూద్దాం.
పూరి జగన్నాథ్:
ఒకప్పటి టాలీవుడ్ స్టార్ డైరెక్టర్‌లలో పూరి జగన్నాథ్ ఒకరు. వరుస సినిమాలను తెరకెక్కిస్తూ బ్లాక్ భాస్కర్ సక్సెస్‌లు అందుకుంటున్న పూరీ.. ఇటీవల కాలంలో అయిన తెరకెక్కించిన కంటెంట్ తో ఆడియన్స్‌ను ఆకట్టుకోలేకపోతున్నాడు. ఈ క్రమంలో వరుస డిజాస్టర్‌లను ఎదుర్కొంటున్నాడు. ఇక పూరీ తను నెక్స్ట్ సినిమాతో అయినా కచ్చితంగా హిట్ కొట్టకపోతే.. ఇండస్ట్రీలో సర్వైవ్ అవ్వడం కష్టతరమౌతుంది అనడంలో సందేహం లేదు.
హరీష్ శంకర్:
టాలీవుడ్ లో టాలెంటెడ్ డైరెక్టర్‌గా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న హరీష్ శంకర్ తెరకెక్కించిన సినిమాలు అతి తక్కువ అయినా.. మంచి సక్సెస్‌లు అందుకున్నాడు. కానీ ఇటీవల కాలంలో ఆయన తెరకెక్కించిన సినిమాలు.. ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నాయి. అలా చివరిగా హరీష్ శంకర్ నుంచి వచ్చిన మిస్టర్ బచ్చన్ ఫ్లాప్ గా నిలిచిన సంగతి తెలిసిందే. దీంతో హరీష్ శంకర్ ఇమేజ్‌కు భారీ డ్యామేజ్ కలిగింది. ఇక హరీష్ తన నెక్స్ట్ సినిమాతో అయినా కచ్చితంగా సక్సెస్ అందుకోకపోతే.. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ల రేసు నుంచి వెనుకబడిపోతాడు.
శ్రీను వైట్ల:
శ్రీను వైట్ల కెరీర్ ప్రారంభం నుంచి ఎన్నో సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. మొదట్లో ఆయన తెరకెక్కించిన దాదాపు అన్ని సినిమాలు బ్లాక్ బస్టర్‌గా నిలిచినా.. చివరిగా సినిమా దూకుడు సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. తర్వాత ఆయన తీసిన ఒక్క సినిమా కూడా హిట్ కాకపోగా.. వరుస ప్లాప్లను ఎదుర్కొంటున్నాడు. ఈ క్రమంలోనే శీను వైట్ల కూడా తన తర్వాత సినిమాతో కచ్చితంగా హిట్ కొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీరితో పట్టే ఇంకా చాలామంది టాలీవుడ్ డైరెక్టర్స్ కచ్చితంగా హిట్ కొట్టి కం బ్యాక్ ఇవ్వకపోతే దుకాణం మూసేయాల్సిన పరిస్థితి.