స్టార్ హీరోయిన్ సమంత నటించిన తాజా వెబ్ సిరీస్ సిటాడెల్.. హనీ బన్నీ. ఇందులో వరుణ్ ధావన్ హీరోగా, కేకే మేనన్, సికిందర్ కేర్, షాకీబ్ సలీం, సిమ్రాన్ తదితరులు కీలక పాత్రలో నటించారు. ఇక ఈ సినిమాకు సీత. ఆర్. మేనన్ రచయితగా వ్యవహరించారు. రాజ్ అండ్ డీకే ద్వయం డైరెక్షన్లో రూపొందిన ఈ సిరీస్ తాజాగా ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్మింగ్‌కు వచ్చింది. తాజాగా ఓటీటీలోకి వచ్చేసిన ఈ సిరీస్ ఎలా ఉంది. క్రైమ్ థ్రిల్లర్ ఆడియన్స్‌ను ఆకట్టుకుందా లేదా ఒకసారి చూద్దాం.
ఎప్పటి నుంచో వస్తున్న స్పై, యాక్షన్ చైన్ సినిమాలన్నీటిలోనూ కంటెంట్ వేరైనా.. అసలు కథ ఒకటే. అది ఓటీటీ అయినా, సినిమాల్లో అయినా. ప్రపంచాన్ని శాసించే ఓ శక్తిని గుప్పెట్లో పెట్టుకోవాలని ఓ నియంత ఆరాటం. అందుకు అవసరమైన ఆయుధాలు పరికరాలను సంపాదించి వాటిని కంట్రోల్ చేయడానికి.. తిరుగులేని శక్తిగా ఎదగడానికి పోరటం చేస్తూ ఉంటారు. ఏజెంట్ అయినా మన హీరో, హీరోయిన్లు రంగంలోకి దిగి దుష్ట శిక్షణ, ధర్మ రక్షణతో కథను సుఖాంతం చేస్తారు. అయితే కథలో హీరో, హీరోయిన్లు చేసే యాక్షన్, ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసే విధానంపై సినిమా రిజల్ట్ ఆధారపడి ఉంటుంది. అయితే విషయంలో సిటాడెల్.. హనీ బన్నీ.. మాత్రం కాస్త తడబడింది. యావరేజ్ అనిపించింది.
కథ:
హనీ (సమంత) నేనిటాల్లోని ఒక కేఫ్ లో పనిచేస్తూ ఉంటుంది. ఆమెకు నాడీయా (కశ్మీ) అనే కూతురు ఉంటుంది. కేఫ్ కోసం సరుకులు తీసుకురావడానికి మార్కెట్ వెళ్లిన హనీని ఫాలో అవుతూ కొంతమంది పట్టుకుంటారు. ఈ క్రమంలో వాళ్ళకి పట్టుబడిన హనీ అక్కడి నుంచి తప్పించుకుని కూతుర్ని తీసుకుని వేరే ఊరికి షిఫ్ట్ అయిపోతుంది. అక్కడ కూడా హనీ ఉన్న ప్రదేశాన్ని కనుక్కొని కొందరు వ్యక్తులు వెంటపడుతూ ఉంటారు. మరోవైపు చనిపోయిందనుకున్న భార్య హనీ.. బ్రతికే ఉందని బన్నీ (వరుణ్ దావన్) తెలుసుకుంటాడు. దీంతో హనీ ని వెతుక్కుంటూ ఇండియాకి వచ్చేస్తాడు. ఇంతకీ హానీఇ వెంటపడుతున్న వాళ్లంతా ఎవరూ..? వారితో పోరాడడానికి సమంత సామర్థ్యం ఎక్కడి నుంచి వచ్చింది..? ఇంతకీ అసలు హనీ గతం ఏంటి..? తన భార్యను వెతుక్కుంటూ వచ్చిన బన్నీ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చింది..? చివరకు బన్నీ.. హనీని, తన బిడ్డ నాడియాను కలుస్తాడా..? లేదా..? ప్రైవేట్ సీక్రెట్ ఏజెన్సీ నాయకుడు గురు (కేకే మేనన్) ఓవైపు.. సిటాడెల్ బృందం మరోవైపు వెతుకుతున్న ఆర్మార్డ్ అనే వస్తువు ఏంటి..? దేనికి సంబంధించింది..? చివరకు అది ఎవరికి దక్కింది..? సిరీస్ లో చూడాల్సిందే.
విశ్లేషణ
సిరీస్లో స్టోరీ కొత్తగా అనిపించకపోయినా.. తెరపైకి తీసుకురావడంలో వైవిధ్యత చూపించడానికి రాజ్ అండ్ డీకే కష్టపడినట్లు అర్థమవుతుంది. ప్రతి ఎపిసోడ్ రెండు భాగాలుగా తీసుకువచ్చారు. ఒకటి 1992లో జరుగుతున్న కథ.. మరొకటి ప్రస్తుతం 2000 లో జరుగుతున్నట్లుగా చూపించారు. అద్భుతమైన స్క్రీన్ ప్లే తో కథ నడిచింది. అలా ప్రస్తుతం జరుగుతున్న కథ, ఫ్లాష్ బాక్ లో జరిగిన సంఘటనలు దేనికి అది ఒకదానితో ఒకటి కనెక్ట్ చేసి గందరగోళం లేకుండా సన్నివేశాలను చూపించారు. మొదటి రెండు ఎపిసోడ్లలో సిరీస్ లోని కీలక పాత్రలు.. వారి బ్యాక్ గ్రౌండ్, కథనం ఆడియన్స్‌కు పరిచయం చేయడానికి కేటాయించారు. అయితే దీనికి చాలా సమయం తీసుకున్నారనిపిస్తుంది. సీన్స్ కూడా కాస్త ల్యాగ్ అనిపిస్తాయి. అయితే పాత్రలో పరిచయం గురించి కాదు.. 80, 90ల కాలంలో మహిళలు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొనేవారు.. హనీ పాత్ర ద్వారా కళ్ళకు కట్టినట్లు చూపించారు.
ఎంత పెద్ద రాజు కుటుంబంలో పుట్టిన అమ్మాయి అయినా.. సాంప్రదాయాలు, కట్టుబాట్లు పేరుతో ఎలాంటి ఆంక్షలు ఎదుర్కోవాల్సి వచ్చింది. బాల్యవివాహాలు లాంటి అంశాలను కూడా చూపించారు. అయితే సన్నివేశాల్లో బలమైన ఎమోషన్స్ లేవు. ఇక కట్టుబాట్లను తెంచుకొని సాధికారత దిశగా అడుగుపెట్టిన అమ్మాయిగా సమంత పాత్రను డిజైన్ చేశారు. మరో ఎపిసోడ్ నుంచి అసలు స్టోరీ ప్రారంభమైంది. ప్రపంచంలో ఉండే.. దేశాధినేతలను సైతం శాసించే శక్తి ఆర్మూర్డ్‌లో ఉంటుంది. దీనిని దక్కించుకోవలని గురు టీం ప్రయత్నాలు చేస్తారు. వాటిని సెటాడెల్ బృందం బెడిసి కొట్టేలా చేస్తుంది. అయితే ఈ సీన్స్ పెద్ద థ్రిల్లింగ్ అనిపించుకున్నా.. చూడాలని ఆసక్తి మాత్రం ఉంటుంది. ఈ క్రమంలో ఒక్క నార్మల్ అమ్మాయిగా ముంబై వచ్చిన హనీ.. ఏజెంట్ గా మారడానికి దారి తీసిన పరిస్థితులు.. దానికోసం ఆమె తీసుకునే ట్రైనింగ్.. ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
ఇక స్టోరీ బాల్ గ్రేట్ కు షిఫ్ట్ అయిన తర్వాత అందరూ దక్కించుకోవాలనుకుంటున్న ఆ ఆర్మార్డ్ శక్తి ఏంటి.. దాంతో ఏం చేయొచ్చు.. దాన్ని దక్కించుకోవడానికి హనీ బన్నీ ఆడిన గేమ్ ఏంటో.. అనే అంశంపై కథ కూల్ గా సాగుతుంది. పెద్దగా ట్విస్టులు కనిపించవు. అంతేకాదు కథలో వచ్చే చేంజ్ లో ఫైరింగ్ లు కూడా రొటీన్ గా అనిపించాయి. ఇక సిరీస్‌లో డాక్టర్ రఘును బన్నీ చంపడంతో కథలో మంచి ట్విస్ట్ వచ్చింది. అప్పటివరకు మంచి కోసం ప్రయత్నిస్తారు అనుకున్న పాత్రలని ఒక్కసారిగా నెగిటివ్ షేడ్స్‌లో చూపించారు. అదేంటో పూర్తిగా తెలియాలంటే సిరీస్ లో చూడాల్సిందే. ఇక సిటాడిల్ టీం లో వ్యవహరిస్తూనే.. గురుకు సహకరిస్తున్న ఓ వ్యక్తి ఎవరో కూడా బయటపడే ట్విస్ట్ ఆకట్టుకుంటుంది.
అప్పటివరకు హైడెన్సిక్ ఆడిన హానీ, బన్నీలు.. చివరి ఎపిసోడ్ కు యాక్షన్ మోడ్ లోకి దిగి తమ సత్తా చాటుతారు. అంతా అయిపోయింది అనుకునే టైంలో కేడి (షాకీబ్ సలీం) పాత్రను సిరీస్లో ఎంట్రీ ఇచ్చి.. మరింత పొడిగించారు. ఇక సిరీస్లో చివరి 20 నిమిషాల్లో రాజమహల్ లో జరిగే యాక్షన్ సీన్స్ సీరీస్‌కు హైలెట్గా నిలుస్తాయి. చాలా వరకు సింగిల్ టాక్సిన్స్ కనిపించాయి. అయితే సన్నివేశాలను కళ్ళకు కట్టినట్లుగా క్లియర్ గా తీర్చిదిద్దిన కెమెరా మ్యాన్‌ను నిజంగా ప్రశంసించవచ్చు. ఇక సిరీస్‌కు సరైన ముగింపు లేకుండా సీజన్ 2కు బాట వేసినట్లుగా ఆడియన్స్ ఫీల్ అవుతారు. సిటాడెల్, హనీ బన్నీకి ఉన్న కనెక్షన్ హనీ, బన్నీల కుమార్తె పేరు నాడియా. అమెరికన్ ఇటాడెల్ సిరీస్‌లో ప్రియాంక చోప్రా పేరు నాడియా. హనీ బన్నీల పాప పెరిగి పెద్దదిగా మారింది అన్నది ఇంట్రెస్టింగ్ పాయింట్. సినిమా రొటీన్ కథ కావడం, నడివి కూడా ఎక్కువగా ఉండడంతో ఆడియన్స్‌కు బోర్ కొడుతుంది.
నటీనటుల పర్‌ఫార్మెన్స్
ఇక సినిమాలో సమంత.. హనీ పాత్ర చాలా కీలకం. ఇక తన పాత్రలో సమంత జీవించేసింది. , బన్నీ పాత్రలో వరుణ్ ఆకట్టుకున్నాడు. ఇద్దరు నటనతోనే కాదు.. యాక్షన్ సీక్వెన్స్‌లోను అదరగొట్టారు. కేకే మేనన్, సికిందర్ కేర్, సిమ్రాన్ ఇలా బన్నీ టీం అంతా తమ నటనతో మెప్పించారు.
టెక్నికల్‌గా
సాంకేతిక బృందం కూడా సినిమాను ప్రేక్షకులు మెప్పించే విధంగా డిజైన్ చేసేందుకు కష్టపడ్డారు. సాంకేతిక విలువలు ఉన్న సినిమాగా అర్థమవుతుంది. స్కీన్ ప్లే, డెరెన్ ఇలా అన్ని విభాగాలు కలిసికట్టుగా పని చేసినట్లు అర్ధం అవుతుంది.
చివరిగా
సిటాడెల్ చూడాలనుకునే వారు సమంత కోసం చూడొచ్చు. ఫ్యామిలీతో కలిసి సీరీస్ చూడడానికి అభ్యంతరం ఏది ఉండదు. ఎలాంటి అభ్యంతరకర పదాలు, ఇబ్బందికర సన్నివేశాలు లేవు.