ఊరించి ఊరించి అంద‌రిని మోసం చేసిన బ‌న్నీ.. సుకుమార్‌.. పుష్ప 2లో అది లేదు..?

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న తాజా మూవీ పుష్ప 2 కోసం ఆడియన్స్ అంతా మోస్ట్ ఎవైటెడ్‌గా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్‌ ప్రేక్షకులంతా కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న ఏ సినిమా.. మరో నెలలో ఆడియన్స్ ముందుకు రానుంది. సుకుమార్ డైరెక్షన్లో ఫుల్ ఆఫ్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాపై.. ఇప్పటికే ప్రేక్షకల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే రోజురోజుకు సినిమాపై మరి నీ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ వైరల్ గా మారుతున్నాయి. ఇక ఈ సినిమాల్లో ఐటమ్ సాంగ్ పై ఆడియోస్లో మొదటి నుంచి మంచి ఆసక్తి నెల‌కొన్న సంగతి తెలిసిందే.

Pushpa 2: Did Sreeleela replace Shraddha Kapoor in the special song in Allu  Arjun's film for ...

పుష్ప పార్ట్ 1లో సమంత ఊ అంటావా మమా.. ఉఊ అంటావా మ‌మా.. అంటూ ఇండస్ట్రీని షేక్ చేసింది. ఇది సినిమాకు మరింత హైలెట్‌గా నిలిచింద‌న‌టంలో సందేహం లేదు. ఈ క్రమంలోనే పార్ట్ 2లో ఐటమ్ సాంగ్ ఎవరితో ఉండబోతుందని ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. అయితే మొదట శ్రద్ధా కపూర్ ఇందులో నటిస్తుందంటూ వార్తలు వినిపించినా.. తర్వాత టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీల‌ను తీసుకున్నారని టాక్ నడిచింది. ఇక డాన్సింగ్ క్వీన్ గా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న శ్రీ లీల.. బన్నీ లాంటి స్టార్ డ్యాన్సర్ తో చిందేస్తే రెండు కళ్ళు సరిపోవు అంటూ అభిమానులు తమ అభిప్రాయాలను కూడా వ్యక్తం చేశారు.

Sree Leela Steps In For Pushpa 2 Item Song?

కానీ.. ఇప్పుడు ఈ ఐటమ్ సాంగ్ సంబంధించి మరో షాకింగ్ అప్డేట్ నెటింట‌ వైరల్‌గా మారుతుంది. పుష్ప 2 ర‌న్‌ టైం ప్రాబ్లంతో ఓ సాంగ్ ను అసలు లేకుండా లేపేయబోతున్నారని.. ఈ విషయంపై ఇప్పటికే సుకుమార్ , మూవీ టీం ఫిక్స్ అయిపోయారంటూ తెలుస్తుంది. ఇంతకీ పుష్ప 2 నుంచి తీసేయబోతున్న సాంగ్ ఏంట‌నే అంశం ప్రస్తుతం హాట్‌ టాపిక్‌గా మారింది. ఇప్పటివరకు ఐటెం సాంగ్ పై ఆడియన్స్ పెట్టుకున్న అంచనాలను తలకిందులు చేస్తూ.. ఐటమ్ సాంగ్ కానీ తీసేయరు కదా అంటూ అభిమానుల్లో సందేహాలు మొదలయ్యాయి. అయితే ఈ సినిమాలో తీయబోతున్న సాంగ్ ఏంటో మేకర్స్ నుంచి క్లారిటీ వచ్చే వరకు వేచి చూడాల్సిందే.