టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర సినిమా పనుల్లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత చిరు నెక్స్ట్ చేయబోయే సినిమా ఏమై ఉంటుందనే అంశంపై ఇప్పటివరకు క్లారిటీ రాలేదు. అయితే తాజాగా చిరు నెక్స్ట్ మూవీ పై ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ నెటింట వైరల్‌గా మారుతుంది. రచయిత బివిఎస్.రవి స్వయంగా మెగాస్టార్ చిరంజీవి నెక్స్ట్ ప్రాజెక్ట్ పై అప్డేట్ ఇచ్చారు. బాక్సాఫీస్ వద్ద మరో క్రేజీ ప్రాజెక్ట్ త్వరలోనే సెట్స్ పైకి రానుందని.. మెగాస్టార్ ఈ సినిమాలో నటించబోతున్నారని చెప్పుకొచ్చాడు.
చిరంజీవి కోసం ఓ మంచి కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాను సిద్ధం చేసినట్లు వివరించిన బి.వి.యస్.. ఇప్పటికే చిరుకి కథను కూడా వినిపించారట. ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఠాగూర్ తర్వాత మరోసారి అదే తరహాలో.. ఆ రేంజ్‌లో ఈ కథ ఉండబోతుందని చెప్పుకొచ్చాడు. అయితే దర్శకుడుగా ఎవరు వ్యవహరిస్తారు.. అనే దానిపై మాత్రం ఆలోచనలో ఉన్నారట. ఆల్రెడీ చిరు హీరోగా ఠాగూర్, ఖైది నెంబర్ 150 సినిమాలను తెరకెక్కించి బ్లాక్ బస్టర్ సక్సెస్‌లు ఇచ్చిన వి.వి. వినాయక్ దర్శకత్వంలో ఓ సినిమా వస్తే బాగుంటుందని.. అంతా భివిస్తున్నారట.
చిరు ఇమేజ్‌ను డీల్ చేయడంతో పాటు.. ఆడియన్స్ పల్స్ కూడా పర్ఫెక్ట్ గా తెలిసిన కమర్షియల్ డైరెక్టర్ గా ఆయనకు మంచి ఇమేజ్ ఉంది. కనుక ఆయన అయితేనే బెస్ట్ అని అనుకుంటున్నారట. మరో పక్కన తమిళ్ డైరెక్టర్ మోహన్ రాజ పేరు కూడా పరిశీలిస్తున్నట్లు టాక్. ఇక గాడ్ ఫాదర్ లాంటి మంచి సక్సెస్ఫుల్ సినిమా తర్వాత.. మోహన్ రాజాతో మరో సినిమా చిరు నటించబోతున్నాడు అంటూ వార్తలు వినిపించాయి. ఈ క్రమంలోనే చిరు.. విశ్వంభర తర్వాత ప్రాజెక్టును మోహన్ రాజకు ఇవ్వాలని చూస్తున్నాడట. ఠాగూర్ 2.0 రేంజ్‌లో ఈ సినిమా ఉండబోతుందని నెట్టింట వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా త్వరలోనే రానుంది.