రిలీజ్‌కు 28 రోజుల ముందే ‘ పుష్ప 2 ‘ కు షాకింగ్ క‌లెక్ష‌న్లు… బ‌న్నీ ఏంటి సామి ఈ అరాచ‌కం..?

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. రష్మిక మందన హీరోయిన్గా నటించిన తాజా మూవీ పుష్ప 2. ఈ ఏడాది డిసెంబర్ 5న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్లో ఈ సినిమా ఫుల్ యేక్ష‌న్ డ్రామాగా రూపొందుతుంది. గతంలో వీరిద్దరి కాంబోలో తెర‌కెక్కి బ్లాక్ బస్టర్ సక్సెస్ గా నిలిచిన పుష్పాకు సీక్వెల్ గా పుష్ప 2 రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సినిమా సెట్స్‌ పైకి వచ్చినప్పటి నుంచి ఆడియ‌న్స్‌లో విపరీతమైన అంచనాలను నెలకొన్నాయి.

फिल्म 'पुष्पा-2' ने रिलीज से पहले ही अमेरिका में बनाया नया रिकॉर्ड - Royal  Bulletin

ఇక ఈ సినిమాకు.. కేవలం నెల రోజులు మాత్రమే టైమ్ ఉండడంతో మేకర్స్ ఆడియన్స్‌లో అంచనాలను పెంచేందుకు.. కొత్త కొత్త అప్డేట్లను షేర్ చేస్తూ ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇస్తున్నారు. ఇక అన్నిటికంటే ముందుగా ఓవర్సీస్ లో పుష్ప 2 సినిమా ప్రీమియర్ షోస్ రిలీజ్ చేయనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రీమియర్ షోకు టికెట్ బుకింగ్స్ కూడా ఓపెన్ చేశారు. పుష్ప 2 కలెక్షన్ల పరంగా రికార్డులు క్రియేట్ చేస్తుంది. తాజాగా 1500కే ప్లస్ టికెట్లు అతి త్వరగా అమ్ముడుపోయిన ఇండియన్ సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది.

కాగా తాజాగా మరోసారి పుష్పరాజ్ తన సత్తా చూపించాడు. ఇప్పటివరకు మొత్తంగా ఓవర్సీస్ లో 500 కే డాలర్ ప్లస్ ప్రీమియర్ కలెక్షన్లు వసూలు చేసినట్లు యూనిట్ అఫీషియల్ గా ప్రకటించింది. ఇక సినిమా రిలీజ్ కు దాదాపు 28రోజులు ఉండగానే పుష్ప రాజ్ ఈ రేంజ్‌లో రికార్డులు క్రియేట్ చేస్తున్నాడంటే.. సినిమా రిలీజ్ అయి పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే ఇంకెన్ని రికార్డులు క్రియేట్ అవుతాయో అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలోనే ప్రీమియర్ కలెక్షన్ల లెక్కలు నెటింట‌ వైరల్‌గా మారడంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు.