ఈ పై ఫోటోలో కనిపిస్తున్న కాశ్మీరి సోయగాన్ని గుర్తుపట్టారా.. ఈమె ఒకప్పటి సౌత్ స్టార్ బ్యూటీ. తెలుగు, తమిళ, మలయాళ భాషలతో సంబంధం లేకుండా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించే స్టార్ హీరోయిన్గా మంచి ఇమేజ్ను సంపాదించుకుంది. 80,90లలో బిజీ హీరోయిన్గా వరుస సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ.. చిరంజీవితో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లోను ఆకట్టుకుంది. హీరోయిన్ గా ఎన్నో సినిమాల్లో నటించి ఎంతో మంది ఫ్యాన్స్ ని సంపాదించుకున్న ఈ అమ్మడు తర్వాత ఏజ్ కు తగ్గ పాత్రలను ఎంచుకుంటూ అమ్మగా, అత్తగా, వదినగా ఇలా ఎన్నో పాత్రలో నటించి ఆకట్టుకుంది. ఇప్పటికీ సినిమాల్లో యాక్టివ్ గా ఉంటూనే మరోవైపు పాలిటిక్స్‌లోను రాణిస్తోంది.
ఇంతకీ ఈ అమ్మడు ఎవరో గుర్తుపట్టారా.. తనే సీనియర్ నటి రాధికా శరత్ కుమార్. సినీ బ్యాగ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రాధిక.. తమిళ్ సినీ నటుడు, హాస్యనటుడుగా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న ఎం.ఆర్.రాధ.. నట వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఇక ఈ పై కనిపిస్తున్న ఫోటో అమ్మడు చైల్డ్ ఆర్టిస్ట్ గా అడుగుపెట్టిన శ్రీలంక గీతా సినిమాలో నటించిన టైంలోది. 1972లో డైరెక్టర్ భారతీయ రాజా తెరకెక్కించిన ఇష్క్ ఇస్తే షో మీయువర్ రైల్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ వరస సినిమా అవకాశాలను అందుకుంటూ తిరుగులేని స్టార్ హీరోయిన్గా ఎదిగింది.
మెగస్టార్‌తో ఎన్నో హిట్ సినిమాలలో నటించింది. ఇక కమల్ హాసన్, రాధిక నటించిన స్వాతిముత్యం సినిమా ఇప్పటికీ క్లాసికల్ సూపర్ హిట్ గా ప్రేక్షకుల హృదయాలలో నిలిచిపోయింది. ఇక రాధిక తన కోస్టార్ అయినా శరత్ కుమార్‌ను ప్రేమించి 2001లో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి రాహుల్, రియా అనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. హీరోయిన్ గానే కాదు.. దర్శకురాలుగా, నిర్మాతగాను తన సత్తా చాటుకున్న రాధిక.. రాడర్ మీడియా వర్క్స్ ఇండియా లిమిటెడ్ వ్యవస్థాపకురాలిగా రాణిస్తుంది. ఇప్పటికే జాతీయ అవార్డును దక్కించుకున్న రాధిక.. ఆరు ఫిలిం అవార్డులు, రెండు నంది అవార్డులు, మూడుసార్లు తమిళ్ ప్రభుత్వ రాష్ట్ర చలనచిత్ర అవార్డు సొంతం చేసుకుంది. ప్రస్తుతం రాధిక శరత్ కుమార్ బిజెపి పార్టీలో అభ్యర్థిగా వ్యవహరిస్తుంది. ఈ ఏడాది ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన.. రాధిక ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉంది.