తమిళ్ ఇండస్ట్రీ బ్యాన్‌.. సాయి పల్లవికి బిగ్ షాక్..

నాచురల్ బ్యూటీ సాయి పల్లవికి టాలీవుడ్ లో ఉన్న క్రేజ్ గురించి.. పాపులాంటి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రేమమ్ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు.. ఎన్నో సినిమాలతో స్టార్ హీరోయిన్ ఇమేజ్‌ సంపాదించుకుంది. అందం అభిన‌యంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న సాయి పల్లవి.. గ్లామరస్ పాత్రలకు దూరంగా ఉంటూ నాచురల్ లుక్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలో ఆడియన్స్లో అమ్మడికి మరింత క్రేజ్ పెరిగింది. ప్రస్తుతం రామాయణం, తండేల్‌ సినిమా షూట్ లలో బిజీగా గడుపుతున్న సాయి పల్లవి.. ఇటీవల కోలీవుడ్ స్టార్ శివ కార్తికేయన్ సరసన అమరాన్ సినిమాలో జంటగా నటించిన సంగతి తెలిసిందే.

దీపావళి కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా బ్లాక్ బ‌స్టర్‌ను సొంతం చేసుకుంది. ఇక అమ్మడి యాక్టింగ్ కు ఆడియన్స్ ఫిదా అయిపోయారు. సాయి పల్లవి సాధారణంగానే గొడవలకు చాలా దూరంగా ఉంటుంది. అలాంటిది మొదటిసారి ఆమె చేసిన కామెంట్స్ నెటింట‌ వివాదంగా మారాయి. గతంలో ఇంటర్వ్యూలో సాయి పల్లవి మాట్లాడుతూ.. ఇండియన్ ఆర్మీ ని ఆ గౌరవ పరిచేలా కామెంట్ చేసింద‌ని ఓ పోస్ట్‌ను తెగ వైర‌ల్ చేస్తున్నారు. అందులో ఈ అమ్మ‌డు మాట్లాడుతూ.. సమస్య పరిష్కారానికి హింస సరైన మార్గం కాదు. ఒకప్పుడు చట్టం లేకపోవడంతో యుద్ధాలు చేసేవారు. ఇప్పుడు ఆ అవసరం లేనేలేదు.

AMARAN - MOVIE REVIEW|sivakarthikeyan|Sai pallavi|hamalahasan|Rajkumar  #‪@ulagantv‬ - YouTube

పాక్ వాళ్ళు ఇండియన్ ఆర్మీ ని, ఇండియన్ వాళ్లు పాక్ ఆర్మీని టెర్రరిస్టులుగా భావిస్తూ చంపుకుంటున్నారంటూ కామెంట్ చేసింది. అప్పట్లో సాయి పల్లవి చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ చేస్తూ.. తన కామెంట్స్ పై ఫైర్ అవుతున్నారు. ఇండియన్ ఆర్మీని అగౌరపరిచేలా మాట్లాడిన ఈ అమ్మాయి ఎలా మిలటరీ ఆర్మీ భార్యగా అమరాన్ సినిమాలో నటించింది అంటూ ఫైర్ అవుతున్నారు. ఇకపై తమిళ్ సినిమాల్లో ఆమెను బ్యాన్‌ చేయాలంటూ సోషల్ మీడియాలో తెగ పోస్టులు చేస్తున్నారు. అయితే ఈ వివాదంపై సాయి పల్లవి రియాక్ట్ అవుతూ నేను కావాలని అన్నమాటలు కావ‌ని.. నా ఉద్దేశం వేరే అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వార్త నెటింట‌ వైరల్‌గా మారుతుంది.