పవన్ తో ఫస్ట్ మూవీ.. కొంతకాలానికే ఫెడౌట్.. ఈ హీరోయిన్ ను గుర్తుపట్టారా..?

సినీ ఇండస్ట్రీలో నటినట్లుగా అడుగుపెట్టి స్టార్ బ్యూటీస్ గా ఎదగాలని ఎంతోమంది ఆరాటపడుతూ ఉంటారు. దానికోసం శ్రమిస్తూ ఉంటారు. అయితే సినిమాలో అవకాశాలు రావాలంటే టాలెంట్ తో పాటు అదృష్టం కూడా ఉండాలని సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ పై ఫోటోలో కనిపిస్తున్న అమ్మడు కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంది. అలా మొదటి సినిమాతోనే పవన్ కళ్యాణ్ సరసన నటించే ల‌క్కి ఛాన్స్ కొట్టేసింది. అయితే ఈ సినిమా డిజాస్టర్ కావడంతో అమ్మడికి టాలీవుడ్ లో పెద్దగా అవ‌కాశాలు రాలేదు.

ఇంత‌కి ఈ అమ్మ‌డు ఎవ‌రో గుర్తు ప‌ట్టారి.. యూకేలో సెటిల్డ్‌ గుజరాతి ఫ్యామిలీలో 1990లో ఈ అమ్మ‌డు జ‌న్మించింది. ఇక‌ టీనేజ్ లో ఉన్నప్పుడే మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టి మిస్ ఇండియా ఆఫ్ యూకే విజేతగా సక్సెస్ సాధించింది. 15 ఏళ్లకే బీబీసీ లో పలు షోల‌లో సందడి చేసింది. యాక్టర్ అవుదామని ఆశ‌తో బాలీవుడ్‌లో అడుగు పెట్టింది. ఇక అవకాశం వచ్చినట్టే వచ్చి ఓ సినిమా ఆగిపోయిన.. తెలుగులో పవర్ స్టార్ సినిమాతో అవకాశాన్ని దక్కించుకుంది. ఇంతకీ ఈ అమ్మడు ఎవరో ఇప్పటికైనా గుర్తుపట్టారా.. తనే కొమరం పులి మూవీ హీరోయిన్ నికిషా పటేల్.

అలా పవన్ సినిమాల్లో అవకాశం కొట్టేసిన నిక్కీషా.. మొదటి సినిమా హిట్ అయితే హీరోయిన్గా సెటిలైపోవచ్చు అని భావించింది. కానీ.. అది కాస్త డిజాస్టర్ కావడంతో కెరీర్ అంతమైపోయింది. ఈ సినిమా తర్వాత ఓం త్రిడి, అరకు రోడ్డులో, గుంటూరు టాకీస్ 2.0 లాంటి సినిమాల్లో నటించిన ఊహించిన సక్సెస్ అందుకోలేకపోయింది. తమిళ్, కన్నడ లోను పలు సినిమాల్లో కనిపించింది. ఇవేవీ అమ్మడికి సక్సెస్ అందించలేకపోయాయి. దీంతో 2019లో యాక్టింగ్‌కు గుడ్ బై చెప్పేసి.. ఇండస్ట్రీకి దూరమైంది. ప్రస్తుతం 34 ఏళ్ళ నికిషా ఫ్యామిలీతో కలిసి యుకేలో లైఫ్ లీడ్‌ చేస్తుంది. అప్పుడప్పుడు తన హాట్ గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటుంది.