” పుష్ప 2 ” స్పెషల్ సాంగ్ లో శ్రీ లీల.. సమంతను మైమరిపిస్తుందా..

ప్రస్తుతం టాలీవుడ్ ప్రేక్షకులతో పాటు ఎంతోమంది ప్రేక్ష‌కులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ పుష్ప ది రూల్. ఐకాన్ స్టార్‌ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్షన్‌లో తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో రష్మిక మెయిన్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అంతే కాదు ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ కూడా ఉండనుంది. అయితే స్పెషల్ సాంగ్ లో శ్రీ లీల ఛాన్స్ కొట్టేసింది అంటూ న్యూస్ వైర‌ల్ అవుతుంది. ఇక బన్నీ, శ్రీలీల కాంబోలో సాంగ్ వస్తే ఫ్యాన్స్ ఆనందానికి హద్దులు ఉండవనడంలో అతిశయోక్తి లేదు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు డ్యాన్స్‌పై ఉన్న పట్టు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Allu arjun sreeleela ♥️😍💫 #sreeleela #alluarjun

ఎలాంటి స్టెప్స్ అయినా అలవోకగ‌గా వేసేస్తాడు బన్నీ. ఇక శ్రీలీల డ్యాన్సింగ్ క్వీన్. టాలీవుడ్ లోనే డ్యాన్స్‌తో అదరగొట్టే హీరోయిన్లలో శ్రీ‌లీల‌ మొదటి వరుసలో ఉంటుంది. ఈ క్రమంలో బన్నీ, శ్రీలీల కాంబోలో ఐటెం సాంగ్ రిలీజ్ అయితే ఇక నిజంగానే ఆ సాంగ్ వేరే లెవెల్‌లో ఉంటుందంటూ అభిమానులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక పుష్ప పార్ట్ 1లో సమంత ఐటెం గర్ల్ గా ప్రేక్షకులను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఊ అంటావా ఉ ఊ అంటావా అంటూ ఇండస్ట్రీని షేక్ చేసిన ఈ ముద్దుగుమ్మ.. సాంగ్ తో సినిమాకి హైలెట్ గా నిలిచింది. ఇక ఇప్పుడు శ్రీ లీల తన పర్ఫామెన్స్ తో సమంతను మైమరిపిస్తుందో లేదో వేచి చూడాలి.

Samantha said 'f**k it, I'll do it' when Pushpa's Oo Antava came to her.  She reveals on KWK 7 - India Today

ఇక పుష్పాది రూల్ సినిమా రిలీజ్ కు మరో నెల రోజులు సమయమే ఉండడంతో వీలైనంత త్వరగా ఈ సాంగ్ పూర్తి చేసి రిలీజ్ కు సిద్ధం చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. ఇక ఇప్పటికే రికార్డ్ స్థాయి స్క్రీన్‌లో సినిమా రిలీజ్ కానుంది. పుష్ప 2 సినిమా ప్రతి పది నిమిషాల్లో ఒక ట్విస్ట్ ఉంటుందని ఆడియన్స్‌ను కచ్చితంగా ఆకట్టుకుంటుందని టాక్ నడుస్తుంది. ఈ సినిమాతో రష్మిక మార్కెట్ మరింతగా పెరగడం ఖాయం అంటూ సమాచారం. భారీ బడ్జెట్ ప్ర‌తిష్టాత్మకంగా తెర‌కెక్కుతున్న ఈ సినిమా ఏ రేంజ్ లో సక్సెస్ సాధిస్తుందో.. రూ.1000 కోట్లు మించి కలెక్షన్లు కొల్లగొట్టి సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందో.. లేదో.. వేచి చూడాలి. ఇప్పటికే సినిమాకు 11,500కు పైగా థియేటర్లలో రిలీజ్‌కు ప్లాన్ చేశారు మేకర్స్. ఈ క్రమంలోనే రిలీజ్‌కు ముందే అత్యధిక థియేటర్లలో రిలీజ్ అవుతున్న సినిమాగా రికార్డ్ క్రియేట్ చేశాడు పుష్ప రాజ్.