సింగర్ గా గ్లోబల్ స్టార్ నయా అవతార్.. రామ్ చరణ్ ‘ గేమ్ ఛేంజర్ ‘ మరో క్రేజీ అప్డేట్..

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రామ్ చరణ్.. ప్ర‌స్తుతం గ్లోబల్ స్టార్‌గా రాణిస్తున్న సంగ‌తి తెలిసిందే. తండ్రికి తగ్గ తనయుడుగా మంచి పేరు సంపాదించుకున్న చ‌ర‌ణ్‌.. ప్రస్తుతం సౌత్ ఇండియన్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్‌తో గేమ్ ఛేంజ‌ర్‌ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదల కోసం అభిమానులు, ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 10న ఈ సినిమా రిలీజ్ కానుంది. తెలుగు తో పాటు హిందీ, తమిళ్ లో కూడా ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. ఈ నెల 9న టీజ‌ర్ రివీల్ కానుంది. ఇక ఈ టీజర్ తో అసలు కథ ఏంటనే అంశంపై ఒక క్లారిటీ వస్తుందని అభిమానులు కోరుకుంటున్నారు.

ఇదిలా ఉంటే చరణ్ సింగర్ గా మారిపోయాడంటూ మరొక రోజు న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది. అయితే చరణ్ గేమ్ ఛేంజర్‌ సినిమా కోసం ఒక పాట పాడాడు అనుకుంటే పొరపాటే. గతంలో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ కోసం ఓ ప్రమోషనల్ సాంగ్ ని చరణ్ పాడిన సంగతి తెలిసిందే. దాన్నే ఫ్యాన్స్ మరోసారి గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో పాత వీడియోను షేర్ చేస్తున్నారు. ప్రస్తుతం అది తెగ వైరల్ గా మారుతుంది. మన శర్మ కంపోస్ట్ చేసిన ఈ పాట అప్పట్లో ఎలక్షన్స్ ప్రమోషన్ల కోసం తెగ వాడేసారు. ఇక గేమ్ ఛేంజర్ విషయానికి వస్తే.. ఇప్పటికే సినిమా నుంచి వచ్చిన ప్రతి ప్రమోషనల్ కంటెంట్, సాంగ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

Game Changer song Jaragandi: Ram Charan and Kiara Advani dance their hearts  out in foot-tapping track. Watch -

లిరికల్ సాంగ్స్ శంకర్ మార్క్ చూపించాయంటూ కామెంట్లు వ్యక్తం అయ్యాయి. టీజర్ తర్వాత మూడవ పాటను రిలీజ్ చేయనున్నారట టీం. ఇది రామ్ చరణ్, కియార‌ అద్వానీ మధ్య వచ్చే రొమాంటిక్ సాంగ్ అని.. ఈ సాంగ్ కోసం ఏకంగా శంకర్.. ప్రొడ్యూసర్ దిల్ రాజుతో రూ.30 కోట్లు ఖర్చు చేయించారని సమాచారం. దీన్ని బట్టి ఈ సినిమాలో పాట‌లు ఏ రేంజ్‌లో ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ సినిమాలో చరణ్ విభిన్నమైన గెటప్స్‌లో కనిపించబోతున్నాడని.. స్టూడెంట్, ఐఏఎస్ ఆఫీసర్, పొలిటిషియ‌న్ గా నట విశ్వరూపాన్ని చూపించబోతున్నాడు అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. రంగస్థలంలా మరో బెస్ట్ మూవీ గా ఈ సినిమా ఉండనుందట.