సినీ ఇండస్ట్రీలో ఒకరితో సినిమా అనుకున్న తర్వాత.. ఏవో కారణాలతో వారిని తప్పించి మరొకరితో సినిమాను తెరకెక్కించిన సందర్భాలు చాలానే ఉంటాయి. అలా గతంలో కూడా టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో.. నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన సినిమాలో హీరోయిన్గా మొదట త్రిషను భావించారట. కానీ.. ఈ అమ్మడు ఏవో కారణాలతో సినిమాను రిజెక్ట్ చేయడంతో.. ఆమె ప్లేస్ లో కాజల్‌ను తీసుకుని సినిమాలు రూపొందించారు. మరి బాలయ్య బ్లాక్‌బస్టర్ సినిమాలో అవకాశాన్ని త్రిష రిజెక్ట్ చేయడానికి కారణం ఏంటి.. అసలు ఆ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుందో ఒకసారి చూద్దాం.
బాలయ్య నుంచి చివరిగా తెరకెక్కిన భగవంత్ కేసరి ఎలాంటి రిజల్ట్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాతో చాలాకాలం తర్వాత హ్యాట్రిక్ సక్సెస్ అందుకొని మంచి ఊపులో ఉన్నాడు బాలయ్య. ఈ క్రమంలోనే ప్రస్తుతం తన 109వ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే భగవంత్ కేసరి సినిమాలో బాలయ్య సరసన కాజల్ హీరోయిన్గా నటించిన సంగతి తెలిసిందే. శ్రీ లీల కీలక పాత్రలో నటించిన ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకుడిగా వ్యవహరించాడు. ఎస్. ఎస్. థమన్ సంగీతం అందించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ సక్సెస్ అందుకొని మంచి క్రేజ్‌తో దూసుకుపోతుంది.
ఇక మొదట్లో ఈ సినిమాకు హీరోయిన్ పాత్ర కోసం త్రిషను అనుకున్నారట. అయితే త్రిష రిజెక్ట్ చేయడంతో ఈ సినిమాలో కాజల్ నటించిందని సమాచారం. త్రిష ఈ సినిమాను చిన్న కారణాలతో రిజక్ట్ చేసింది అంటూ న్యూస్ వైరల్ అవుతుంది. అమ్మడికి కథ నచ్చి.. సినిమాలో నటించాలనిపించినా.. అప్పటికే కొన్ని సినిమాలకు సైన్ చేసి ఉండడం.. ఇక ఈ సినిమా షూట్ డేట్స్ తన సైన్ చేసిన ప్రాజెక్టుల డేట్స్ కూడా ఒకేరోజు ఉండడంతో డేట్స్ అడ్జస్ట్ కావాలి కారణంతో సినిమాను రిజెక్ట్ చేసిందట. తర్వాత దీనికోసం మూవీ టీం కాజల్‌ను సంప్రదించగా ఆమె ఈ సినిమాలో బాలయ్య సరసన నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలా త్రిష అనుకున్న సినిమాలో కాజల్ హీరోయిన్గా నటించి హిట్ సినిమాను తన ఖాతాలో వేసుకుంది.